SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style, What is written on that paper?
Abhishek Sharma: ఐపీఎల్ 2025 27వ మ్యాచ్ లో హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడయంలో పంజాబ్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైాదరాబాద్ టీమ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల సూపర్ నాక్ లతో 18.3 ఓవర్లలోనే 247/2 పరుగులతో విజయాన్ని అందుకుంది.
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style, What is written on that paper?
ఈ మ్యాచ్ లో పరుగుల సునామీ వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం రేపాడు. పంజాబ్ బౌలర్లను దంచికొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 100 పరుగులు చేసి ఐపీఎల్ తొలి సెంచరీతో మెరిశాడు.
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style
24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సునామీ ఇన్నింగ్స్ తో సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలో ఒక భారత ప్లేయర్ చేసిన మూడో ఫాస్టెస్ సెంచరీ ఇది. అభిషేక్ శర్మ కంటే ముందు యూసుఫ్ పఠాన్ 37 బంతులు, ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో సెంచరీలు బాదారు. మొత్తంగా ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 30 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ కొట్టాడు.
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style
అభిషేక్ శర్మ తొలి ఐపీఎల్ సెంచరీ సెలబ్రేషన్ అదరిపోయింది. ఎందుకంటే రాసి పెట్టుకొని మరి సెంచరీ కొట్టాడు. అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ కొట్టిన తర్వాత ఒక నోట్ ను బయటకు తీసి చూపించాడు. అందులో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ తన సెంచరీని అంకితం చేస్తూ తాను ఆడబోయే నాక్ నోట్ ను ముందు రాసుకొచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఎలాంటి ఆటను ఆడాలనే ఉద్దేశంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడో. ప్రస్తుతం అభిషేక్ శర్మ సెంచరీ నోట్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
SRH vs PBKS: Abhishek Sharma celebrates maiden IPL hundred in style
ఉప్పల్ స్టేడియాన్ని షేక్ చేసిన అతని సెంచరీ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మొత్తంగా అభిషేక్ శర్మ 141 పరుగుల ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు, 10 ఫోర్లు బాది పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాకిచ్చాడు.
IPLలో ఫాస్టెస్ట్ సెంచరీలు
30 బంతుల్లో - క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 బంతుల్లో- యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై BS, 2010
38 బంతుల్లో- డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013
39 బంతుల్లో- ట్రావిస్ హెడ్ (SRH) vs RCB, బెంగళూరు, 2024
39 బంతుల్లో- ప్రియాంష్ ఆర్య (PBKS) vs CSK, ముల్లాపూర్, 2025
40 బంతుల్లో- అభిషేక్ శర్మ (SRH) vs PBKS, హైదరాబాద్, 2025*