Shubman Gill. (Photo- IPL)
Shubman Gill: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ తో అదరగొట్టాడు. ఐపీఎల్ 2025 26వ మ్యాచ్‌లో లక్న్ - గుజరాత్ జట్లు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇందులో గిల్, సాయి సుదర్శన్ మధ్య 120 పరుగుల బిగ్ ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా ఉంది. గిల్ మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత మోగించాడు.
Shubman Gill
లక్నో బౌలింగ్ ను దంచికొట్టిన గిల్
టాస్ గెలిచిన రిషబ్ పంత్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సాయి సుదర్శన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్, సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు. వీరిద్దరి సూపర్ నాక్ తో ఒక్క వికెట్ నష్టపోకుండా 120 పరుగులకు చేర్చాడు. 38 బంతుల్లో 60 పరుగులు చేసిన గిల్ తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
అలాగే, సాయి సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 56 పరుగులు చేశాడు. అయితే, వీరిద్దరూ ఔటవగానే, గుజరాత్ బ్యాటింగ్ తడబడింది. 200లకు పైగా పరుగులు చేస్తుందనుకున్న జీటీ 180 పరుగులు మాత్రమే చేసింది.
Shubman Gill
గుజరాత్ తరఫున తొలి బ్యాట్స్‌మన్ గా గిల్ మరో ఐపీఎల్ రికార్డు
శుభ్‌మన్ గిల్ తన 60 పరుగుల ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తరపున 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ ఫ్రాంచైజీ తరపున ఈ మార్కును అందుకున్న మొదటి బ్యాట్స్‌మన్ గిల్. ఒక జట్టు తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా కూడా గిల్ 5వ స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ 2022 ప్రీ-వేలం డ్రాఫ్ట్‌లో గిల్ గుజరాత్‌తో చేరాడు. వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లను కూడా ఎంపిక చేసింది. 2022 ఐపీఎల్‌లో శుభ్‌మన్ 16 మ్యాచ్‌ల్లో 483 పరుగులు చేశాడు. 2018లో అరంగేట్రం చేసిన తర్వాత ఇది అతని అత్యుత్తమ ఐపీఎల్ ప్రదర్శన. హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ ఐపీఎల్ 2022 ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి, ఐపీఎల్ తొలి సీజన్‌లోనే ట్రోఫీని గెలుచుకోవడంలో గిల్ కీలకపాత్ర పోషించాడు.
Shubman Gill
ఒక జట్టు తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్
క్రిస్ గేల్ - 41 ఇన్నింగ్స్ (ఆర్సీబీ)
కేఎల్ రాహుల్ - 43 ఇన్నింగ్స్ (పంజాబ్ కింగ్స్)
డేవిడ్ వార్నర్ - 47 ఇన్నింగ్స్ (ఎస్‌ఆర్‌హెచ్)
జోస్ బట్లర్ - 49 ఇన్నింగ్స్ (ఆర్‌ఆర్)
శుభ్‌మాన్ గిల్ - 51 ఇన్నింగ్స్ (గుజరాత్ టైటాట్స్)
Shubman Gill (Photo: IPL)
గత కొన్ని సంవత్సరాలుగా గిల్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2023లో శుభ్‌మాన్ అద్భుతమైన ఫామ్‌తో పరుగులు వర్షం కురిపిచాడు. 59.33 సగటుతో 890 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ ఓడిపోయింది. దీంతో వరుసగా రెండవ ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలనే వారి కల చెదిరిపోయింది. ఐపీఎల్ 2024లో ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరడంతో గిల్ గుజరాత్ జట్టును ముందుకు నడిపిస్తూ 12 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
శుభ్ మన్ గిల్ - 2007
సాయి సుదర్శన్ - 1363
డేవిడ్ మిల్లర్ - 950
హార్దిక్ పాండ్యా - 833
వృద్ధిమాన్ సాహా - 824