Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్ నుండే కోహ్లీకి ఇంత సంపాదనా..! ఒక్క పోస్ట్‌కు ఎంత తీసుకుంటాడో తెలుసా..?

Published : Jan 19, 2026, 03:57 PM IST

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్, ఎండార్స్ మెంట్, వ్యాపారాల నుండే కాదు చివరకు సోషల్ మీడియా నుండి కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా?

PREV
15
ఇన్స్టాలోనే కోహ్లీకి ఇంత ఆదాయమా..!

విరాట్ కోహ్లీ క్రికెట్ సూపర్‌స్టారే కాదు, సోషల్ మీడియా సంచలనం కూడా. అతడు ఇన్‌స్టాగ్రామ్ లో 274 మిలియన్ల ఫాలోవర్లను కలిగివున్నాడు. అందుకే అతడి ప్రతి ఇన్స్టా పోస్ట్ కేవలం భారతీయులనే కాదు ఇతర దేశాల క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో కోహ్లీ కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో చేరిపోయారు.

25
ఒక్క పోస్టుకు ఇన్ని కోట్లే..!

ఒక్కో బ్రాండెడ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు కోహ్లీ సుమారు రూ.12 నుండి14 కోట్లు సంపాదిస్తాడని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అతని భారీ ఫాలోయింగ్, గ్లోబల్ అప్పీల్ బ్రాండ్‌లకు అతన్ని టాప్ ఛాయిస్‌గా మార్చాయి.

35
ఇన్స్టా నుండి అత్యధిక ఆదాయం పొందేదెవరు?

ప్రపంచంలో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ సంపాదనపరుల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడు కోహ్లీ. ఫుట్ బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో పోస్ట్‌కు రూ.26 కోట్లు, మెస్సీ రూ.21 కోట్లు తీసుకుంటారు. ఈ స్ధాయిలో తీసుకునే క్రికెటర్లలో ఇండియన్ ప్లేయర్ కోహ్లీ ముందువరుసలో ఉంటారు.

45
ఆటతోనే కాదు పోస్టుతో సంపాదన

అయితే రిపోర్ట్స్ లోని సంఖ్యలు కచ్చితం కాకపోయినా, కోహ్లీ సోషల్ మీడియా ఉనికి భారీ బ్రాండ్ విలువను సృష్టిస్తుంది. అతని పోస్టులు క్రీడలకు మించి సంపాదనకు మార్గమని నిరూపిస్తున్నాయి. ఇలా ఆటతోనే కాదు సంపాదనతో కూడా కోహ్లీ వార్తల్లో నిలుస్తున్నారు.

55
కోహ్లీ నికర సంపాదన ఎంత..?

కేవలం క్రికెట్ మాత్రమే కాదు వివిధ మార్గాల్లో విరాట్ కోహ్లీ సంపాదిస్తున్నారు... అతడి నికర ఆస్తి రూ.1000 కోట్లకు పైనే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెటర్ గానే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఎండార్స్ మెంట్స్ ద్వారా కూడా కోహ్లీ అత్యధికంగా డబ్బులు పొందుతున్నాడు. ఐపిఎల్ లో ఆర్సిబి తరపున ఆడుతున్న కోహ్లీకి రూ.21 కోట్లు అందుతున్నాయి... బిసిసిఐ కాంట్రాక్ట్ ద్వారా మరో 7 కోట్లు వస్తున్నాయి. వీటన్నింటికంటే ప్రకటనల ద్వారానే కోహ్లీకి ఎక్కువ ఆదాయం వస్తోంది... వివిధ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్న అతడికి ఏటా రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని ఓ అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories