SRH: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఓ ఫ్రాంచైజీ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ ఆఫర్‌ను ఇద్దరు ప్లేయర్స్ ఒప్పుకున్నారో.? లేదో..? ఇప్పుడు తెలుసుకుందామా..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, ఓపెనింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు ఓ ఫ్రాంచైజీ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏడాది పొడవునా తమ ఫ్రాంచైజీ తరపున టీ20 టోర్నమెంట్లు ఆడాలని కోరింది. అంతేకాదు ఏకంగా ఆస్ట్రేలియన్ క్రికెట్‌ను పూర్తిగా విడిచిపెట్టాలని చెప్పిందట. అయితే ఈ ఆఫర్‌ను ఆ ఇద్దరు ప్లేయర్స్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.
25
క్రికెట్ ఆస్ట్రేలియాను వదిలేయాలి
ఈ ఇద్దరు ఏడాది పొడవునా అన్ని టీ20 ఫార్మాట్లలో తమ ఫ్రాంచైజీ తరపున ఆడేందుకు.. ఒక్కొక్కరికి 10 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ. 58.2 కోట్లు) ఇచ్చేందుకు సిద్దమైందట. ఈ డీల్ విషయమై సదరు ఫ్రాంచైజీ అనధికారికంగా ఇద్దరి ప్లేయర్స్‌ను సంప్రదించగా.. వారిద్దరూ దీన్ని సున్నితంగా తిరస్కరించి.. తాము ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారట.
35
అన్ని తెలుసు.! కానీ సీక్రెట్ డీల్
ఇలాంటి డీల్స్ ఆటగాళ్ల జీతాలను పెంచేందుకు ఉపయోగపడటమే కాదు.. ఆస్ట్రేలియా ప్రధాన టీ20 లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్‌ను సైతం ప్రైవేటీకరించడానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ డీల్‌పై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా, స్టేట్ అసోసియేషన్లు, ప్లేయర్స్ యూనియన్ మధ్య చర్చలు జరిగాయి. కానీ ఒక్కటి కూడా అధికారికంగా వెలువడలేదు.
ఐపీఎల్ 2024 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా తన జట్టుకు కెప్టెన్‌గా చేసింది. ఇక ఈ ఏడాది వేలానికి ముందు అతడ్ని ఫ్రాంచైజీ రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక ట్రావిస్ హెడ్ సంపాదన విషయానికొస్తే.. 2024లో SRH అతడ్ని రూ. 6.8 కోట్లకు కొనుగోలు చేయగా.. 2025లో అది కాస్తా రూ. 14 కోట్లకు చేరింది. అటు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి స్పోర్ట్స్ అథ్లెట్స్‌తో పోలిస్తే.. ఆ దేశ క్రికెటర్ల సంపాదన చాలా తక్కువ అని తెలుస్తోంది.
55
క్రికెటర్ల సంపాదన తక్కువే..
మరోవైపు అగ్రశ్రేణి ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సంపాదనతో పోలిస్తే.. కమ్మిన్స్ ఏడాదికి భారీగానే జీతం వెనకేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ సంవత్సరానికి ఒక్కొక్కరు 1.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 8.74 కోట్లు) సంపాదిస్తే.. కమ్మిన్స్ ఏడాదికి దాదాపుగా 3 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 17.48 కోట్లు) తన జేబులో వేసుకుంటాడు.