Published : Oct 07, 2025, 11:54 PM ISTUpdated : Oct 08, 2025, 12:14 AM IST
CEAT Cricket Awards 2025: సీఈఏటీ క్రికెట్ అవార్డ్స్‌లో రోహిత్ శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి ప్రత్యేక గౌరవం లభించింది. అలాగే, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ లు అవార్డులు గెలుచుకున్నారు.
ముంబైలో మంగళవారం 27వ సీఈఏటీ క్రికెట్ రేటింగ్ (CCR) అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, క్రీడా నాయకులను సత్కరించారు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 38 ఏళ్ల రోహిత్‌కి ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో భారత జట్టును విజయవంతంగా ముందుకు నడిపినందుకు ప్రత్యేక అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఆయన భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా తీసుకున్నారు. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు, జూన్ 2024లో బార్బడోస్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్‌ను కూడా భారత్ గెలుచుకుంది.
25
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారి కనిపించాడు !
ఈ వేడుక రోహిత్ శర్మకు ఒక ప్రత్యేక సందర్భమైంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఇది ఆయన తొలి పబ్లిక్ అప్రియరెన్స్. గత శనివారం ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా ప్రకటించారు. రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. మార్చి 2025లో దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఇది వారి తొలి అంతర్జాతీయ సిరీస్ కావడం గమనార్హం.
35
మెరిసిన సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్
ఈ కార్యక్రమంలో సంజూ శాంసన్ "మెన్స్ టీ20ఐ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకున్నారు. ఆయనతో పాటు వరుణ్ చక్రవర్తి "మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు. అలాగే, భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌కు "సీఈఏటీ జియోస్టార్ అవార్డు" లభించింది. విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ "వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్"గా, ఆయన సహచరుడు హెన్రీ "వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయ్యారు.
మహిళా విభాగంలో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చాటారు. స్మృతి మంధాన "వుమెన్స్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్"గా, దీప్తి శర్మ "వుమెన్స్ బౌలర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయ్యారు. వీరు ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న మహిళా వరల్డ్ కప్ 2025లో పాల్గొంటుండటంతో ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు.
55
ఇతర విభాగాల్లో అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే
సీఈఏటీ క్రికెట్ అవార్డ్స్‌లో పలు వర్గాల్లో క్రికెటర్లను సత్కరించారు. వారిలో..
బ్రయాన్ లారా "లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు"ను అందుకున్నారు.
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ "ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు.
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య "టెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు.
ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రుక్ "టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులు అందుకున్నారు.
అంగ్రిష్ రఘువంశీ "ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయ్యారు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా "ఎగ్జెంప్లరీ లీడర్‌షిప్ అవార్డు"ను గెలుచుకున్నారు.
దేశీయ క్రికెట్ విభాగంలో హర్ష్ దూబే "సీఈఏటీ డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు అందుకున్నారు.
భారత లెజెండ్ బి.ఎస్. చంద్రశేఖర్ "సీఈఏటీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు"ను అందుకున్నారు.