DDCA: రాజకీయాలు అనేవి ఏ రంగంలో ఉండవు చెప్పండి. ఐటీ సెక్టార్ దగ్గర నుంచి క్రికెట్ వరకు.. తనవాడే జట్టులో ఉండాలని కొందరు సెలెక్టర్లను ఫోర్స్ చేస్తే.. లేదు మావాడే ఫైనల్ అంటూ మరికొందరు.. ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు చేసుకుంది.
ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(DDCA) పెద్ద వివాదంలో చిక్కుకుంది. మరో రెండు రోజుల్లో వినూ మన్కడ్ ట్రోఫీ(Vinoo Mankad Trophy) రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అండర్-19 జట్టును డీడీసీఏ ఎంపిక చేయగా.. ఈ ఎంపిక ఓ పెద్ద గోల్‌మాల్ బయటపడింది.
25
కీపింగ్ అనుభవం లేకుండానే ఎంపిక
వికెట్ కీపర్‌గా అనుభవం లేని ఓ ఓపెనింగ్ బ్యాటర్‌ను ఢిల్లీ అండర్ 19 జట్టులో రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇదంతా కూడా డీడీసీఏలోని ఓ సీనియర్ అధికారి ఒత్తిడి వల్లే జరిగిందని ఇన్‌సైడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కసారిగా ఈ ఎంపిక కారణంగా జట్టు ఎంపిక విషయంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో.. చివరికి తలొగ్గి ప్రాబబుల్స్‌లో కీలక మార్పులు చేయాల్సి వచ్చింది.
35
సీనియర్ అధికారి ఒత్తిడి వల్లే..
అక్టోబర్ 3వ తేదీన 23 మంది సభ్యులతో కూడిన ఢిల్లీ అండర్ 19 జట్టును ప్రకటించగా.. అందులో అభిరాజ్ గగన్ సింగ్‌ను వికెట్ కీపింగ్‌కు ఫస్ట్ ఛాయిస్‌గా పేర్కొన్నారు. అయితే స్క్వాడ్‌లోని 22వ ప్లేయర్‌ను సెకండ్ అండ్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే ఆ స్లాట్‌లో అస్సలు ఇప్పటిదాకా వికెట్ కీపింగ్ చేయని ఆటగాడిని ఎన్నుకున్నట్టు జాతీయ మీడియా పలు కథనాల్లో పేర్కొంది. ఆపై ఒక్కసారిగా అసోసియేషన్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని పలువురు సీనియర్ DDCA అధికారులు నేరుగా అధ్యక్షుడు రోహన్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. అర్హత ఆధారంగా కాకుండా.. ఇలా ఒకరిద్దరి పెద్దల ఒత్తిడి వల్ల ఆటగాళ్లను టీంలో చేర్చుకోవడం సరికాదని వాపోయారు. దీంతో వెంటనే జైట్లీ ఈ అంశంపై చర్యలు తీసుకున్నారు
ఆ ఆటగాడి స్థానంలో జెన్యూన్ బ్యాకప్ వికెట్ కీపర్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో సర్దుబాటు చర్యలు త్వరతగిన పూర్తవ్వడమే కాకుండా.. స్క్వాడ్ ఇప్పటికే వినూ మన్కడ్ ట్రోఫీ కోసం రాంచీకి చేరుకుంది. ఇక ఈ ఘటన విషయంలో సెలెక్టర్ల తప్పు లేదని అంతర్గత వర్గాలు తెలిపాయి. బ్యాకప్ వికెట్ కీపర్‌కు బదులుగా.. కీపింగ్ తెలియని ఓపెనింగ్ బ్యాటర్‌కు వికెట్ కీపర్ అనే ముద్ర వేసేలా ఓ సీనియర్ డీడీసీఏ అధికారి చేశారని సెలెక్టర్లు ఆరోపించారు. వివాదం ఇంతటితో ఆగలేదు. జట్టులో మరో రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. వయస్సు ధృవీకరణకు సమర్పించిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒకరిని.. కారణాలు తెలియవి గానీ మరో ఆటగాడిని కూడా మార్చాల్సి వచ్చింది.
55
రాంచీలో ఢిల్లీ అండర్-19 టీం..
డీడీసీఏ అధికారులు సెలెక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు కావడంపై నిషేధాన్ని విధిస్తూ లోక్‌పాల్(అంబుడ్స్‌మన్) గత సంవత్సరమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయగా.. వాటిని బేఖాతరు చేస్తూ కార్యదర్శి అశోక్ శర్మ, జాయింట్ సెక్రటరీ అమిత్ గ్రోవర్.. ఇటీవల అషు డాని అధ్యక్షతన జరిగిన U19 సెలక్షన్ ప్రక్రియకు హాజరైనట్టు తెలుస్తోంది. అంతర్గత రాజకీయాలు జట్టు ఎంపికను ప్రభావితం చేస్తే.. అది కచ్చితంగా ఢిల్లీ క్రికెట్‌ను దెబ్బతీస్తాయని.. డీడీసీఏ పాలన, పారదర్శకతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తాయని అసోసియేషన్ సభ్యుడు సురేష్ కుమార్ శర్మ అన్నారు. ఈ ఘటనపై ఆయన సెప్టెంబర్ 28న అధ్యక్షుడు జైట్లీకి లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని కోరారు. కాగా ఢిల్లీ అండర్ 19 జట్టు ప్రస్తుతం రాంచీలో ముమ్మర కసరత్తులు చేస్తోంది.