సారా టెండూల్కర్-సారా అలీ ఖాన్, మ‌రో న‌గులురు కూడా - శుభ్‌మన్ గిల్ ప్రేయ‌సి ఎవ‌రు?

First Published | Sep 8, 2024, 2:38 PM IST

Shubman Gill Girlfriend : టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్  సెప్టెంబర్ 8న తన 25వ బర్త్ డే జరుపుకుంటున్నారు. టీమిండియా 'ప్రిన్స్'గా పిలుచుకునే శుభ్‌మన్.. తక్కువ సమయంలో స్టైలిష్ బ్యాటింగ్‌తో ఫేమస్ అయ్యాడు. చాలా మంది సెబ్రిటీల పేర్లు వినిపించాయి, కానీ గిల్ అసలు ప్రేయ‌సి ఎవ‌రు?
 

Shubman Gill, Sara Tendulkar, Sara Ali Khan,

Shubman Gill Girlfriends : టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ సెప్టెంబర్ 8న తన 25వ బర్త్ డే జరుపుకుంటున్నారు.  2018లో భారత U-19 ప్రపంచ కప్ విజేత టీమ్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. 

వన్డేల్లో వేగవంతమైన 2000 రన్స్ పూర్తి చేయడంతో పాటు 2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ లో 2023లో గుజరాత్ తరఫున ఆడి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 
 

టీమ్ ఇండియా 'ప్రిన్స్'గా పిలుచుకునే శుభ్‌మన్ గిల్.. ఇలా తక్కువ సమయంలో స్టైలిష్ బ్యాటింగ్‌తో ఫేమస్ అయ్యాడు. అతను భారత జట్టు తరపున 25 టెస్ట్ మ్యాచ్‌లలో 35.5 సగటుతో 1492 పరుగులు చేశాడు. 47 వన్డేల్లో 2328 పరుగులు చేశాడు. అతని సగటు 58.1. అలాగే, 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 30.4 సగటుతో 587 పరుగులు చేశాడు.

క్రికెట్‌లో అద్భుత విజయాలు సాధించిన గిల్.. క్రికెట్ మైదానంలోనే కాకుండా బ‌య‌ట కూడా ప్రేమ వ్య‌వ‌హారాల‌తో బాలీవుడ్ ప్ర‌పంచంలో కూడా చాలా ఫేమస్ అయ్యాడు. అత‌ని ప్రేమ వ్యవహారంపై ఇప్ప‌టికీ జోరుగా చర్చలు జరుగుతున్నాయి.


శుభ్‌మన్ పేరు చాలా మంది అందమైన అమ్మాయిలతో ముడిపడి పెడుతూ హాట్ టాపిక్ అయ్యాడు. భారత ఓపెనర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ పేరు ఇటీవల టీవీ నటి రిద్ధిమా పండిట్‌తో ముడిపడి పెడుతూ సోష‌ల్ మీడియాలో హోరెత్తింది.

టీవీ నటి రిద్ధిమా పండిట్‌తో పెళ్లిపై పుకార్లు కూడా వచ్చాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంపై రిద్ధిమా పండిట్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తనకు శుభ్‌మన్ గిల్ తెలియదనీ, అతడిని ఎప్పుడూ కలవలేదని చెప్పింది.

శుభ్‌మన్ గిల్ పేరు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్‌తో కూడా ముడిపడి హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ కనిపించారు. ఆ తర్వాత చాలా సార్లు కలిసి కనిపించారు కూడా.

దీంతో శుభ్ మ‌న్ గిల్ గ‌ర్ల్ ఫ్రెండ్ సారా అలీ ఖాన్ అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో క‌నిపించింది. మీడియా కథనాల ప్రకారం వారిద్దరూ ఒకరినొకరు కొన్ని రోజులు డేటింగ్ చేశారు. అయితే, వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారంపై అధికారిక సమాచారం లేదు.

ప‌లు మీడియా కథనాల ప్రకారం, స్పెయిన్‌కు చెందిన మారియో అరోయోగ్‌తో శుభ్‌మాన్ గిల్ కొన్ని రోజులు ప్రేమాయ‌ణం సాగించాడ‌ని పేర్కొన్నాయి.  సారా టెండూల్కర్‌తో తన సంబంధానికి వీడ్కోలు పలికిన తర్వాత, శుభ్‌మన్‌కు మరియా మద్దతు లభించింది.

మరియా శుభ్‌మన్ మ్యాచ్‌లకు హాజరు కావడం, అతని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టులు  ఊహాగానాలకు ఆజ్యం పోశాయి, ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉన్నారా లేదా అనేది తెలియదు.

సారా టెండూల్కర్ గురించి ప్రస్తావించకుండా శుభమన్ గిల్ ల‌వ్ స్టోరీలు పూర్తి కావు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా 2020లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ను ప్రశంసించింది. ఇది వారి ప్రేమ గురించి పుకార్లకు దారితీసింది.

స‌చిన్ టెండూల్క‌ర్ కుమార్తె సారా టెండూల్క‌ర్ తో ప్రేమాయ‌ణం సాగిస్తున్నార‌ని ఆ మ‌ధ్య జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఆ త‌ర్వాత వీరి గురించి పెద్ద‌గా వినిపించ‌డం లేదు.  బ్రేకప్ జ‌రిగింద‌నీ, ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడం వంటి కథనాలు వ‌చ్చాయి. ఇప్పటి వరకు ఈ రిలేషన్‌షిప్‌పై ఇద్దరూ స్టార్లు ఏమీ మాట్లాడలేదు.

Latest Videos

click me!