పంత్ తన బ్యాటింగ్‌తో స్ప్లాష్ చేయడమే కాకుండా, స్టంప్స్ వెనుక తన పాత్రలో కూడా చాలా చురుకుగా ఉన్నాడు. అలాగే, జట్టు విజయం కోసం వ్యూహ రచనలో పంత్ కూడా పాలుపంచుకుంటున్నారు. అభిమన్యు ఈశ్వరన్‌ను ఇండియా బీ కెప్టెన్‌గా నియమించారు, అయితే పంత్ బౌలర్‌లతో చాలా విషయాలు మాట్లాడుతూ సలహాలు, సూచనలు ఇస్తున్న సందర్బాలు ఉన్నాయి.
అదే ఓవర్ చివరి బంతికి ధ్రువ్ జురెల్ వికెట్ తీసిన ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీతో కూడా పంత్ మాట్లాడాడు. పంత్‌తో మాట్లాడిన తర్వాత, సైనీ ఒక క్రాస్ సీమ్ బాల్‌ను వేశాడు, దాని కారణంగా జురెల్ స్టంప్‌ల ముందు దొరికిపోయాడు. అతను ఎల్‌బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న భారత మాజీ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రామన్, పంత్ నాయకత్వ సామర్థ్యాలను ప్రశంసించాడు.
"కెప్టెన్ ఎవరు అన్నది ముఖ్యం కాదు. రిషబ్ పంత్ ఎప్పుడూ మైదానంలో లీడర్‌గా ఉంటాడు. విరామ సమయంలో అతనితో నేను జరిపిన సంభాషణ.. అతను సైనీకి కొన్ని సూచనలు ఇచ్చాడు.. అది కూడా మ్యాచ్ లో కనిపించింది. ప్రభావవంతంగా పనిచేశాయి కూడా" అని అన్నారు. పంత్ కు ఐపీఎల్ లో ఢిల్లీ టీమ్ ను నడిపించిన అనుభవం కూడా ఉంది. కాబట్టి గిల్ తో పాటు రిషబ్ పంత్ కూడా భారత జట్టు కెప్టెన్ రేసులోకి వస్తున్నాడు.