Smriti Mandhana: స్మృతి మంధాన 29వ పుట్టినరోజును జూలై 18న జరుపుకుంటోంది. ఆమె పేరుపై ఉన్న టాప్ 10 అంతర్జాతీయ క్రికెట్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, ఎలిగెంట్ లెఫ్ట్-హ్యాండర్ స్మృతి మంధాన, జూలై 18న తన 29వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆమె భారత మహిళల క్రికెట్‌ను నూతన శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.
ఆమె సాధించిన విజయాలు భారత దేశంలోని అభిమానుల మన్ననలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా గుర్తింపు పొందాయి. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్‌ను అందించడంలో ఆమె నాయకత్వం ప్రధానంగా నిలిచింది.
27
భారత్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు
స్మృతి మంధాన ప్రస్తుతం భారత్ తరఫున మహిళల టీ20 అంతర్జాతీయల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉంది.
మొత్తం పరుగులు: 3982
టీ20 మ్యాచ్‌లు: 153
సగటు: 29.93
37
వన్డేల్లో అత్యధిక సెంచరీలు (భారత్ తరఫున)
స్మృతి మంధాన భారత్ తరఫున మహిళల వన్డేల్లో అత్యధికంగా 10 సెంచరీలు చేసింది. అంతర్జాతీయంగా నాల్గవ స్థానంలో ఉంది. మెగ్ లానింగ్ (15), సుజీ బేట్స్ (13), ట్యామీ బ్యూమాంట్ (11) తర్వాత స్మృతి మంధాన ఉన్నారు.
2. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (భారత్ తరఫున)
జూన్ 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా 112 పరుగులు చేసి భారత మహిళా ఆటగాళ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది.