Shubman Gill: గిల్ vs క్రాలీ.. లార్డ్స్‌ టెస్టులో మూడో రోజు హైడ్రామా.. టీమిండియా ఆటగాళ్ల ఎగతాళి !

Published : Jul 13, 2025, 12:57 AM IST

Shubman Gill: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆఖరి ఓవర్‌లో శుభ్ మన్ గిల్- జాక్ క్రాలీ మధ్య మాటల తూటాలు పేలాయి. కెప్టెన్ గిల్ తన కూల్ నెస్ ను కోల్పోయి రెచ్చిపోయిన వీడియో వైరల్ గా మారింది.

PREV
15
మూడో టెస్టులో మాటల తూటాలు: గిల్, సిరాజ్ అగ్రెసివ్‌ అవతారం

లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆటను ఆలస్యం చేయాలని చూశారు. దీనిపై భారత ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో మ్యాచ్ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. 

మూడో రోజు ఆట ముగిసే సమయంలో శుభ్‌మన్ గిల్, జాక్ క్రాలీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

25
మొదటి ఇన్నింగ్స్‌ స్కోర్లు సమం కావడంతో టెన్షన్ స్టార్ట్

భారత్ 145/3 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించింది. కేఎల్ రాహుల్ సెంచరీ, రిషబ్ పంత్, జడేజాల మంచి నాక్ లతో 387 పరుగులకు ఆలౌటైంది. ఇది ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుతో సమానంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ లు ప్రారంభించారు. అయితే, మూడో రోజు ఆట ముగిసేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. 

దీతో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరూ బంతులు తక్కువ ఆడి టైమ్ ను వృథా చేయాడానికి ప్రత్నించారు. ఇది భారత ఆటగాళ్లకు కోపాన్ని తెప్పించింది.

35
బుమ్రా ఓవర్‌లో తో గిల్ జాక్ క్రాలీ మాటల యుద్ధం

బుమ్రా తన తొలి ఓవర్ వేసేందుకు సిద్ధమైన సమయంలో జాక్ క్రాలీ మళ్లీ మళ్లీ క్రీజ్ వదిలి బయటికి వచ్చి సమయాన్ని వృథా చేశాడు. సైట్స్‌క్రీన్ సమస్యను చూపిస్తూ ఆటను ఆలస్యం చేశాడు. దీనిపై భారత ఆటగాళ్లు మండిపడ్డారు.

రెండో స్లిప్‌లో నిలబడి ఉన్న భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ అయితే, తన కూల్ నెస్ ను కోల్పోయాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ జాక్ క్రాలీపై బూతులతో రెచ్చిపోయాడు. "Grow some b****" అంటూ అశ్లీల పదజాలాన్ని ఉపయోగించాడు.

సిరాజ్ సైతం తన అగ్రెసివ్‌ ను చూపించాడు. బుమ్రా, గిల్, ఇతర ఫీల్డర్లు చప్పట్లతో ఎగతాళి చేస్తూ ఇంగ్లాండ్ ఓపెనర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.

45
వీడియో వైరల్.. అభిమానుల ఆగ్రహం

గిల్ - జాక్ క్రాలీ మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గిల్ కామెంట్స్ స్టంప్ మైక్ లో రికార్దు అయ్యాయి. గిల్ తన చేతులతో చేసిన సంకేతం, అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు అభిమానులు గిల్‌ తీరుపై విమర్శలు చేస్తుండగా, మరికొందరు అతని అగ్రెసివ్ మానసికతను సమర్థిస్తున్నారు.

55
చివరి ఓవర్ హీట్ తో మూడో రోజు ఆట ముగిసింది

బుమ్రా వేసిన ఓవర్‌లో మూడవ బంతి తర్వాత జాక్ క్రాలీ చిన్న గాయం జరిగిందంటూ ఫిజియోను పిలిచాడు. దీంతో మరింత సమయం వృథా అయ్యింది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు స్లో క్లాప్‌లతో స్పందించారు. ఆఖరికి అంపైర్లు మూడో రోజు ఆటను నిలిపివేశారు.

ఈ డైలాగ్ వార్ మ్యాచ్ మూడో రోజు క్లోజింగ్‌ను ఆసక్తికరంగా మార్చింది. ఇరు జట్లకు తొలి ఇన్నింగ్స్‌లలో 387 పరుగులు రావడంతో మ్యాచ్ ఫలితం నాల్గో రోజు తొలి సెషన్‌పై ఆధారపడి ఉంది. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే భారత్ విజయానికి బరిలోకి దిగుతుంది. లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా మిగిలిన రెండు రోజుల ఆట ఉత్కంఠను పెంచుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories