Shubman Gill: టెస్టు, వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్లు వీరే

Published : Jul 11, 2025, 11:54 PM IST

Shubman Gill: టెస్ట్ క్రికెట్, వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 క్రికెటర్ల జాబితాలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేరి చరిత్ర సృష్టించాడు. ఆ టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
సచిన్ టెండూల్కర్‌: వన్డే డబుల్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్

2010లో గ్వాలియర్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుపై 200* పరుగులు చేసి వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. అప్పటివరకు ఎవరూ కూడా డబుల్ సెంచరీ కొట్టలేదు. అలాగే, ఈ స్థాయిలో వన్డే ఇన్నింగ్స్ ను ఆడలేదు.

అంతేకాదు, టెస్ట్ క్రికెట్‌లో కూడా సచిన్ టెండూల్కర్‌ ఆరు డబుల్ సెంచరీలు సాధించారు. ముఖ్యంగా 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై 241* పరుగులు, అదే సంవత్సరం బంగ్లాదేశ్‌పై ఢాకాలో 248* పరుగులు ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లుగా నిలిచాయి.

25
వీరేంద్ర సెహ్వాగ్‌

వన్డేల్లో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్‌పై 219 పరుగులు చేశాడు. అతని ఈ ఇన్నింగ్స్ కేవలం 149 బంతుల్లో రావడం విశేషం. దీని ద్వారా అతను రెండో వన్డే డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

టెస్ట్ క్రికెట్‌లోనూ సెహ్వాగ్ తనదైన ముద్రవేశాడు. 2004లో పాకిస్తాన్‌పై 309, 2008లో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు సాధించాడు. ఇవే కాకుండా టెస్టు క్రికెట్ లో డబుల్ సెంచరీలు కూడా బాదాడు.

35
రోహిత్ శర్మ: వన్డేల్లో ట్రిపుల్ డబుల్ సెంచరీలు

వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు రోహిత్ శర్మ పేరిట ఉంది. ఇది 2014లో శ్రీలంకపై వచ్చిన ఇన్నింగ్స్. రోహిత్ శర్మ మొత్తం మూడు వన్డే డబుల్ సెంచరీలు సాధించాడు.

టెస్ట్ క్రికెట్‌లోనూ రోహిత్ తనదైన ముద్రవేశాడు. 2019లో రాంచీలో దక్షిణాఫ్రికాపై 212 పరుగులు చేశాడు.

45
క్రిస్ గేల్‌

వెస్టిండీస్‌ స్టార్ ప్లేయర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 215 పరుగులు చేసి వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతేతర ఆటగాడిగా నిలిచాడు. అతని ఈ ఇన్నింగ్స్ 147 బంతుల్లో వచ్చింది.

టెస్టుల్లోనూ గేల్ తన బ్యాట్ పవర్ ను చూపించాడు. దక్షిణాఫ్రికాపై 317, శ్రీలంకపై 333 పరుగులతో దుమ్మురేపాడు. క్రిస్ గేల్ తనదైన బ్యాటింగ్ బలమైన హిట్టింగ్ సామర్థ్యంలో ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. టీ20, వన్డే, టెస్టు క్రికెట్.. ఫార్మాట్ ఏదైనా ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ క్రిస్ గేల్.

55
శుభ్‌మన్ గిల్

2023 జనవరిలో న్యూజిలాండ్‌పై హైదరాబాద్‌లో 208 పరుగులతో శుభ్‌మన్ గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత చిన్న వయస్సు గల భారత ఆటగాడిగా నిలిచాడు. తనదైన స్ట్రోక్‌ప్లే, టైమింగ్‌ తో అద్భుత ఇన్నింగ్స్ ను ఆడాడు.

2025 జూలైలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ పై 269 పరుగులు చేసి గిల్ తన టెస్ట్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇది ఇంగ్లాండ్ లో ఒక భారత ఆటగాడు సాధించిన అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories