Joe Root: పాంటింగ్, స్మిత్ రికార్డులను బ్రేక్ చేసిన జోరూట్

Published : Jul 11, 2025, 11:47 PM IST

Joe Root: జో రూట్ లార్డ్స్‌లో సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇది అతనికి భారత్‌పై 11వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీ నాక్ తో జోరూట్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
17
జో రూట్ చరిత్ర సృష్టించాడు

లార్డ్స్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టులో తలపడుతున్నాయి. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ శుక్రవారం 37వ టెస్ట్ సెంచరీ సాధించాడు. రికార్డుల మోత మోగించాడు. 

ఈ సెంచరీతో జో రూట్ లెజెండరీ ప్లేయర్ బ్రాడ్‌మాన్ ఘనతను సమం చేశాడు. అలాగే, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు.

27
లార్డ్స్‌లో 37వ టెస్ట్ సెంచరీ కొట్టిన జోరూట్

భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జో రూట్ 99 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు మొదటి బంతికే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. 

ఈ సెంచరీ అతనికి భారతపై 11వది కావడం విశేషం. అలాగే, లార్డ్స్ వేదికపై ఎనిమిదవ సెంచరీ. ఇది భారత్‌పై ఇంగ్లాండ్‌లో అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు.

37
భారత్‌పై ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ జోరూట్

జో రూట్ ప్రస్తుతం భారత్‌పై ఇంగ్లాండ్‌లో ఎనిమిది సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఉన్నాడు. గతంలో రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లకు ఏడేసి సెంచరీలు ఉన్నాయి. జో రూట్ 2014, 2018, 2021-22 సిరీస్‌లలోనూ భారత్‌పై టెస్టుల్లో సెంచరీలు చేశాడు.

ప్రత్యర్థి హోం గ్రౌండ్ లలో భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీల ప్లేయర్లు

జోరూట్ (ఇంగ్లాండ్) 8

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 7

స్టీమ్ స్మిత్ (ఆసీస్) 7

47
బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన జో రూట్

ఈ సెంచరీతో ఒకే జట్టుపై ఎనిమిది టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా జో రూట్‌ నిలిచాడు. రూట్ కు ముందు ఈ ఘనత ఆస్ట్రేలియన్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ పేరిట ఉంది. 

బ్రాడ్‌మన్‌ ఇంగ్లాండ్‌పై ఎనిమిది సెంచరీలు కొట్టాడు. వీరి తర్వాత రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లు ఏడు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.

57
భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్ జో రూట్

మొత్తంగా జోరూట్ భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా నిలిచాడు. జోరూట్ మొత్తం 11 సెంచరీలు బాదాడు. అలాగే, స్టీవ్ స్మిత్ కూడా 11 సెంచరీలు కొట్టాడు. గ్యారీ సోబర్స్ 8, వివియన్ రిచర్డ్స్ 8, రికీ పాంటింగ్ 8 సెంచరీలతో ఉన్నారు.

67
టెస్ట్ చరిత్రలో టాప్ 5 సెంచరీల జాబితాలోకి జో రూట్

రాహుల్ ద్రావిడ్ (36), స్టీవ్ స్మిత్ (36)ల రికార్డులను జోరూట్ బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్ 5 ప్లేయర్ల లిస్టులో జోరూట్ చేరాడు. 

తన 37వ టెస్ట్ సెంచరీతో ఐదో స్థానంలోకి వచ్చాడు. టాప్ లో వరుసగా సచిన్ టెండూల్కర్ (51), జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార్ సంగక్కర (38)లు ఉన్నారు.

77
లార్డ్స్‌లో జో రూట్ రికార్డులు

లార్డ్స్‌లో గ్రౌండ్ లో జో రూట్‌కు ఇది ఎనిమిదవ సెంచరీ కావడం విశేషం. ఇదే వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గ్రాహమ్ గూచ్ (6 సెంచరీలు) రికార్డును గతంలోనే అధిగమించాడు జో రూట్.

Read more Photos on
click me!

Recommended Stories