IND vs ENG: లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి అంచుకు జారుకుంది. ఇంగ్లాండ్ ఉంచిన 193 పరుగుల టార్గెట్ ముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు భారత్ ను దెబ్బకొట్టాయని విశ్లేషకులు, క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
లార్డ్స్ టెస్టు మ్యాచ్ క్లైమాక్స్‌లో పతనం అంచున భారత్
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో భారత జట్టు పూర్తిగా విఫలమవుతూ, మ్యాచ్‌లో ఓటమికి అంచుకు చేరుకుంది.
మ్యాచ్ చివరి రోజు ప్రారంభంలో భారత్ 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు లార్డ్స్ రెండో ఇన్నింగ్స్ ఘోరంగా విఫలమయ్యారు.
26
శుభ్ మన్ గిల్ - గౌతమ్ గంభీర్ పొరపాటు చేశారా?
భారత జట్టు లార్డ్స్ లో ఇలా కుప్పకూలడానికి కెప్టెన్ శుభ్ మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు కూడా కారణమయ్యాయని క్రికెట్ విశ్లేషకులు, క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్ లు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కీలక పొరపాటు చేశారని పేర్కొంటున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ అవుటైన తర్వాత.. లాజిక్ ప్రకారం నితీష్ రెడ్డిని పంపించాల్సింది. కానీ అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను అతని ముందుగా పంపించారు. ఫలితంగా, సుందర్ డకౌట్ అయ్యాడు, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌కు బలయ్యాడు.
36
మొదటి ఇన్నింగ్స్‌లో నితీష్-జడేజా జోడీ ఫలితమిచ్చినప్పటికీ...
గమనించదగ్గ విషయం ఏంటంటే, తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా కలిసి 70 పరుగులకు పైగా భాగస్వామ్యం అందించారు. అదే జోడీకి రెండో ఇన్నింగ్స్‌లో అవకాశం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ అవకాశాన్ని గిల్-గంభీర్ జోడీ చేజార్చినట్లు కనిపించింది. అయితే, మొత్తంగా భారత్ 82 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఆటను కొనసాగిస్తోంది. వికెట్లు పడిన తర్వాత మళ్లీ ఇప్పుడు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ జోడీ కలిసింది. కానీ, నితీష్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో 13 పరుగులకే అవుట్ అయ్యాడు.
ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ధాటికి భారత టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ లు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు. ప్రత్యేకంగా పంత్ స్టంప్ 'హెలికాప్టర్'లా పరిగెత్తిన దృశ్యం భారత అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది.
56
కేఎల్ రాహుల్ అవుట్ తో భారత్ కష్టాలు పెరిగాయి
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాచ్ చివరి రోజు ఆట ప్రారంభంలోనే కేఎల్ రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ ఔట్ చేశాడు. అప్పటి నుంచి భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత్ చివరి ఆశను కూడా స్టోక్స్ ఆవిరి చేశాడు. ఎందుకంటే అందరూ ప్లేయర్లు విఫలమైన చోట కేఎల్ రాహుల్ క్రీజులో స్థిరంగా నిలిచాడు. మ్యాచ్ ను అతనే గెలిపిస్తాడనేలా ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో అవుట్ (39 పరుగులు) అయ్యాడు.
66
నితీష్-జడేజాలపైనే భారత
ప్రస్తుతం భారత్ స్కోరు 112/8 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో రవీంద్ర జడేజా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో మంచి నాక్ ఆడిన జడేజా ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. భారత్ ను ముందుకు నడిపించే బాధ్యత అతనిపైనే ఉంది. భారత్ విజయానికి ఇంకా 81 పరుగులు కావాలి. ఇంగ్లాండ్ కేవలం రెండు వికెట్లు తీస్తే విజయం అందుకుంటుంది.