కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల కోసం కొత్త షెడ్యూల్ విడుదల

Published : Sep 06, 2025, 05:20 PM IST

Shreyas Iyer : ఇండియా ఏ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఆస్ట్రేలియా-ఏతో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు, మూడు వన్డేలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి.

PREV
15
ఆస్ట్రేలియాతో మ్యాచ్ ల కోసం బీసీసీఐ కొత్త షెడ్యూల్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సెప్టెంబర్‌లో జరగబోయే ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ మధ్య సిరీస్‌కు సంబంధించిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించారు. అలాగే, యంగ్ వికెట్‌కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురేల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

DID YOU KNOW ?
ఐపీఎల్: శ్రేయాస్ అయ్యర్
ఐపీఎల్ లో శ్రేయాస్ అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. అలాగే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను ఫైనల్ కు చేర్చాడు.
25
శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఛాన్స్

శ్రేయస్ అయ్యర్‌కు ప్రధాన భారత జట్టులో వరుసగా అవకాశాలు రాలేదు. ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఆయనకు చోటు ఇవ్వలేదు. అలాగే, రాబోయే ఆసియా కప్ 2025లో కూడా ఎంపిక కాలేదు. 

బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయనకు ఇండియా-ఏకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో వెస్ట్ జోన్ తరఫున ఆడుతున్నారు.

35
జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం

ఈ జట్టులో సీనియర్లతో పాటు ప్రతిభావంతమైన యువ ఆటగాళ్లకు చోటుదక్కింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్‌తో పాటు సాయి సుదర్శన్, ఆయుష్ బదోని కూడా ఎంపికయ్యారు. 

ఆల్‌రౌండర్ సతీశ్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగాన్ని ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ నడిపించనున్నారు. స్పిన్ విభాగంలో హర్ష్ దూబే, తనుశ్ కోటియన్, మానవ్ సుతార్ ఉన్నారు.

45
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, నారాయణ జగదీశన్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్ & వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, సతీశ్ కుమార్ రెడ్డి, తనుశ్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గురునూర్ బరార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్.

రెండో మ్యాచ్‌ నుంచి జట్టులోకి రాహుల్, సిరాజ్

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, పేసర్ మహ్మద్ సిరాజ్ రెండో మ్యాచ్ నుంచి జట్టులో చేరతారు. ఈ సిరీస్‌లో వారి ప్రదర్శనపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

55
ఇండియా-ఏ vs ఆస్ట్రేలియా-ఏ మ్యాచ్‌ల షెడ్యూల్

ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ మధ్య రెండు మల్టీ-డే మ్యాచ్‌లు లక్నోలో జరుగుతాయి.

• మొదటి మ్యాచ్: సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు

• రెండవ మ్యాచ్: సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు

ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత మూడు వన్డేలు కాన్పూర్‌లో జరుగుతాయి.

• మొదటి వన్డే: సెప్టెంబర్ 30

• రెండవ వన్డే: అక్టోబర్ 3

• మూడవ వన్డే: అక్టోబర్ 5

Read more Photos on
click me!

Recommended Stories