చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్.. సోషల్ మీడియాలో పోస్టుల ఉప్పెన !

Published : Oct 18, 2025, 04:52 PM IST

Sanju Samson : టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరతారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రుతురాజ్ గైక్వాడ్‌తో సంజూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

PREV
16
రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ శాంసన్ వదిలేస్తారా?

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్టును వీడవచ్చనే వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సంజూ ఫ్రాంచైజీని వదిలే సంకేతాలు ఇస్తూ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశారని పలు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, ఆ లేఖపై అధికారిక ప్రకటన రాలేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో సంజూ చేసిన ఒక పోస్ట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.

26
రుతురాజ్ గైక్వాడ్‌తో సంజూ శాంసన్ ఫోటో తో అభిమానుల్లో జోష్

సంజూ శాంసన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో "యెల్లో ఆర్మీ"ను సూచించే హింట్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సంజూ సీఎస్కే టీమ్ లోకి వస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో "సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఒప్పందం పూర్తి అయ్యింది" అంటూ అనేక పోస్టులు వెల్లువెత్తాయి. అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున సంజూ ఆడతారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

36
రంజీ ట్రోఫీలోసంజూ, రుతురాజ్

సంజూ శాంసన్ ప్రస్తుతం కేరళ జట్టు తరఫున రంజీ ట్రోఫీ తొలి రౌండ్‌లో ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆయన జట్టు మహారాష్ట్రతో తలపడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. సంజూకు అక్టోబర్ 2024 తర్వాత ఇదే తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం.

గైక్వాడ్ టెస్టు జట్టులో తిరిగి రావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆయన ఇప్పటి వరకు ఎర్ర బంతి క్రికెట్‌లో భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.

46
రాజస్థాన్ రాయల్స్‌లో మార్పులు

సంజూ శాంసన్ ఫ్రాంచైజీని వదిలే ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నా, దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ స్టాఫ్‌లో పెద్ద మార్పులు జరిగాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టును వీడగా, కుమార సంగక్కరను కొత్త హెడ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం.

సంగక్కర ఐపీఎల్ 2021 నుంచి జట్టుతో ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే 2021లో సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు కొత్త కోచింగ్ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో సంజూ భవిష్యత్తుపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి.

56
చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ లో మార్పులు

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు మినీ వేలం జరగనుంది. అన్ని జట్లు తమ రిటెన్షన్ జాబితాను విడుదల చేయాల్సి ఉంది. మినీ వేలం డిసెంబర్ 13-15గా ఉండవచ్చనీ, రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 15గా ఉంటుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

ఇదిలా ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుండి రిటైర్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్‌ మనీ పర్సులోకి ₹9.75 కోట్లు వచ్చాయి. ఫైనల్ రిటెన్షన్‌పై నిర్ణయం స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్ సమావేశం తర్వాత తీసుకుంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక మాజీ బీసీసీఐ, ఐసీసీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ సీఎస్కే చైర్మన్‌గా తిరిగి వచ్చారు. ఆయనకే తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉండనుంది.

66
సంజూ శాంసన్ ఏ జట్టులోకి వెళ్లనున్నారు? ఆయన భవిష్యత్తుపై క్లారిటీ ఎప్పుడు?

జట్టును వీడటం గురించి సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫ్రాంచైజీ మార్పుల మధ్య, ఆయన భవిష్యత్తుపై అనుమానాలు కొనసాగుతున్నాయి. అభిమానులు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ “యెల్లో ఆర్మీ”లో శాంసన్ కనిపిస్తారనే ఆశతో సోషల్ మీడియాలో సంబరాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ లోకి సంజూ వెళ్తారనే చర్చ కూడా క్రికెట్ సర్కిల్ లో నడుస్తోంది. దీంతో సంజూ భవిష్యత్తు ఇంకా క్లారిటీ లేకుండా ఉంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వస్తారనే పోస్టులు అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.

Read more Photos on
click me!

Recommended Stories