Sanju Samson breaks Dhoni's record: ఆసియా కప్ 2025 లో ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ నాక్ తో మెరిశాడు. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని రికార్డును సంజూ బద్దలు కొట్టాడు.
ఆసియా కప్ 2025 గ్రూప్ దశలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మూడో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం 45 బంతుల్లోనే 56 పరుగులు నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు.
సంజూ కీలక నాక్ తో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. టార్గెట్ ను అందుకునే క్రమంలో ఒమన్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
25
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సంజూ శాంసన్
అద్భుతమైన బ్యాటింగ్ తో మెరిసిన సంజూ శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన తొలి భారత వికెట్ కీపర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఒక్కసారి మాత్రమే టీ20 క్రికెట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు.
35
ధోనీ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్
ఒమన్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అధిగమించాడు.
సంజూ శాంసన్ ఇప్పటివరకు 307 మ్యాచ్‌ల్లో 353 సిక్సర్లు బాదాడు. ఇక ఎంఎస్ ధోని 405 మ్యాచ్‌ల్లో 350 సిక్సర్లు మాత్రమే బాదాడు. ఈ రికార్డుతో సంజూ శాంసన్ ఈ లిస్టులో నాల్గోస్థానంలోకి చేరాడు.
టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్ల జాబితాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 463 మ్యాచ్‌లలో 547 సిక్సర్లు బాదాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఆయన 414 మ్యాచ్‌లలో 435 సిక్సర్లు బాదాడు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఆయన 328 మ్యాచ్‌ల్లో 328 సిక్సర్లు బాదాడు. సూర్య తర్వాత సంజూ శాంసన్ ఉన్నాడు.
55
ఆసియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ తో భారత్ బిగ్ ఫైట్
ఒమన్‌పై విజయంతో భారత్ ఆసియా కప్ 2025లో గ్రూప్ ఏ లో వరుసగా మూడు విజయాలు సాధించింది. దీంతో గ్రూప్ ఏ లో టాప్ లో నిలిచి ఆసియా కప్ 2025 సూపర్ 4 దశలోకి అడుగుపెట్టింది.
సెప్టెంబర్ 21న జరగనున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. లీగ్ దశలో భారత్ పాకిస్తాన్ జట్లు ఒకసారి పోటీ పడ్డాయి. పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. మరోసారి అదే రిపీట్ చేయాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది.