వ‌న్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ప్లేయ‌ర్లు ఎవరు?

Published : Aug 15, 2025, 11:40 PM IST

Top Five Indian ODI Run Scorers: వ‌న్డే క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డుల మోత మోగించిన ప్లేయ‌ర్లు చాలా మంది ఉన్నారు. వ‌న్డేల‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు భారత ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
వ‌న్డేల్లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన ప్లేయ‌ర్లు

వ‌న్డే క్రికెట్‌లో భారత్ తరఫున చాాలా మంది బ్యాట్స్‌మెన్ ప‌రుగుల వ‌ర‌ద పారించి అనేక రికార్డులు సృష్టించారు. సచిన్ టెండూల్కర్ నుంచి రాహుల్ ద్రావిడ్ వరకు.. ఐదుగురు ఆటగాళ్లు కఠిన పరిస్థితుల్లోనూ భార‌త్ కు అనేక విజ‌యాలు అందించారు. వీరిలో ఒకే ఒక్క ఎడమచేతి బ్యాట్స్‌మన్ ఉన్నారు. ఈ లిస్టులో భార‌త జ‌ట్టు వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా ఉన్నారు.

DID YOU KNOW ?
వన్డేల్లో డబుల్ సెంచరీలు
వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత ఆటగాళ్లు: రోహిత్ శర్మ (264, 209, 208*), వీరేంద్ర సెహ్వాగ్ (219), సచిన్ టెండూల్కర్ (200*), ఇషాన్ కిషన్ (210).
26
1. సచిన్ టెండూల్కర్

లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్కర్ భారత్ తరఫున వ‌న్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నారు. లిటిల్ మాస్ట‌ర్ మొత్తం 18,426 పరుగులు సాధించారు. 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు టెండూల్కర్ ఖాతాలో ఉన్నాయి. 

1998 సంవత్సరం సచిన్ కెరీర్‌లో అత్యంత విజయవంతంగా సాగింది. ఆ ఏడాది ఆయన 1,894 పరుగులు సాధించి, తొమ్మిది సెంచరీలు బాదారు. క్రికెట్ ప్ర‌పంచంలో "గాడ్ ఆఫ్ క్రికెట్" గా గుర్తింపు పొందారు.

36
2. విరాట్ కోహ్లీ

దిగ్గ‌జ ప్లేయ‌ర్ సచిన్ టెండూల్క‌ర్ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆయన ఇప్పటివరకు 14,181 పరుగులు చేశారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు (51) కొట్టిన రికార్డును కోహ్లీ సాధించారు. 

8,000 నుంచి 14,000 పరుగుల వరకు వేగంగా చేరిన బ్యాట్స్‌మన్ కూడా కోహ్లీనే. రెండవ ఇన్నింగ్స్‌లో 28 సెంచరీలతో "చేజ్ మాస్టర్" గా గుర్తింపు సాధించారు.

46
3. సౌరవ్ గంగూలీ

ప్రిన్స్ ఆఫ్ కోల్ క‌తాగా గుర్తింపు పొందిన భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నారు. దాదా 11,221 పరుగులు చేశారు. వీటిలో 22 సెంచరీలు ఉన్నాయి. 

ఒకే ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసి, 5 వికెట్లు తీసిన అరుదైన రికార్డు ఉన్న ముగ్గురు భారత ఆటగాళ్లలో గంగూలీ ఒకరు. గంగూలీ నాయకత్వంలో భారత్ ఎన్నో విజయాలు సాధించింది.

56
4. రోహిత్ శర్మ

ప్రస్తుతం భారత వ‌న్డే కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 273 మ్యాచ్‌ల్లో 11,168 పరుగులు చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు జట్టును నడిపించాడు. అయితే, అడుగు దూరంలో టైటిల్ చేజారింది. 

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో భార‌త్ ను ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. 2014లో శ్రీలంకపై చేసిన 264 పరుగుల వ‌న్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్.. ఇది ప్ర‌పంచ రికార్డుగా ఉంది.

66
5. రాహుల్ ద్రావిడ్

భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 340 మ్యాచ్‌ల్లో 10,768 పరుగులు చేశారు. వీటిలో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒక సిరీస్‌లో 200 పరుగులు చేసి, వికెట్‌కీపర్‌గా 10 స్టంపింగ్స్/క్యాచ్‌లు అందుకున్న మొదటి భారత ఆటగాడు ద్రావిడ్. ఆయన క్రీజులో ఉన్నారంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టేవి. అందుకే ఆయ‌న ది గ్రేట్ వాల్ గా గుర్తింపు పొందారు.

Read more Photos on
click me!

Recommended Stories