టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్-5 ప్లేయ‌ర్లు ఎవ‌రో తెలుసా?

First Published Sep 15, 2024, 11:04 AM IST

most runs in Test cricket: క్రికెటర్ లో సెంచరీలు చేయడం ఏ ప్లేయ‌ర్ కు అయినా గర్వించదగ్గ క్షణం. దీని కోసం చాలానే క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. అయితే, భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన మొదటి, ఏకైక క్రికెటర్ గా రికార్డు సాధించాడు. సచిన్ టెండూల్కర్ నుండి అలిస్టర్ కుక్ వరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

Sachin Tendulkar

1. స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్)  :

క్రికెట్ గాడ్ గా గుర్తింపు పొందిన స‌చిన్ టెండూల్క‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నారు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

1989లో పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేసిన ఈ దిగ్గజ క్రికెటర్ తన 24 ఏళ్ల కెరీర్‌లో 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు చేశాడు. త‌న అద్భుత‌మైన క్రికెట్ కెరీర్ లో స‌చిన్ టెండూల్క‌ర్ అనేక రికార్డులు సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసింది కూడా ఇత‌నే. 

టెస్టు క్రికెట్ లో స‌చిన్ సాధించ‌ని రికార్డుల్లో ప్ర‌ధాన చెప్పుకోవాల్సింది ట్రిపుల్ సెంచ‌రీ. 2004లో బంగ్లాదేశ్‌పై ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతని అత్యధిక స్కోరు 248 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Highest Test score in a losing cause: In another record feat, Ponting played a commendable knock of 242 against India, as Australia lost the game. However, it turned out to be the highest ever Test score by a batsman on a losing cause.

2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా ) : 

టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన వ‌న్డే కెప్టెన్ గా గుర్తింపు పొందిన పాంటింగ్ 168 మ్యాచ్‌లలో 13,378 పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో రెండుసార్లు అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఏకైక క్రికెట‌ర్ గా నిలిచాడు. 

రికీ పాంటింగ్ త‌న టెస్టు కెరీర్ లో 168 మ్యాచ్ ల‌ను ఆడి 13378 ప‌రుగులు చేశాడు. ఇందులో 41 సెంచ‌రీలు, 62 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా త‌ర‌ఫున విజ‌య‌వంత‌మైన కెప్టెన్ రికీ పాంటింగ్.

అత‌ని కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా జ‌ట్టు 2003, 2007 క్రికెట్ వ‌న్డే ప్రపంచ కప్ లు, 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచింది. పురుషుల క్రికెట్ లో కెప్టెన్ గా అత్యధిక ఐసిసి టోర్నమెంట్ లను గెలిచిన రికార్డును సాధించాడు. అలాగే, 1999 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యునిగా ఉన్నాడు.

Latest Videos


Jacques Kallis

3. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) : 

అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగుల టాప్-5 ప్లేయ‌ర్ల జాబితాలో దక్షిణాఫ్రికా లెజెండరీ ఆల్-రౌండర్ జాక్వెస్ కల్లిస్ మూడో స్థానంలో ఉన్నాడు. అత‌ను 166 మ్యాచ్‌లలో 13,289 టెస్ట్ పరుగులను సాధించాడు. 

తద్వారా టెస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో  ప్లేయ‌ర్ గా రికార్డు సాధించాడు. జాక్వెస్ కల్లిస్ రెడ్-బాల్ క్రికెట్‌లో రెండవ అత్యధిక టెస్ట్ సెంచరీలు కొట్టాడు. క‌ల్లిస్ త‌న టెస్టు క్రికెట్ కెరీర్ లో 45 సెంచ‌రీలు, 58 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లోని బౌండ‌రీలు సాధించ‌డంలో క‌ల్లిస్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. 

క‌ల్లిస్ వ‌న్డేల్లో కూడా అద్భుత‌మైన కెరీర్ ను క‌లిగి ఉన్నారు. 328 వ‌న్డే మ్యాచ్ ల‌లో 11579 ప‌రుగులు చేశాడు. ఇందులో 17 సెంచ‌రీలు, 86 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఐపీఎల్ లో 98 మ్యాచ్ లు ఆడిన క‌ల్లిస్ 2427 ప‌రుగులు సాధించాడు. అలాగే, టెస్టుల్లో 292 వికెట్లు, వ‌న్డేల్లో 273 వికెట్లు, ఐపీఎల్ లో 65 వికెట్లు తీసుకున్నాడు. 

4. రాహుల్ ద్ర‌విడ్ (భార‌త్) : 

భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ల‌లో రాహుల్ ద్ర‌విడ్ ఒక‌రు. స‌చిన్ టెండూల్క‌ర్, సౌర‌వ్ గంగూలీల‌తో క‌లిసి ద్ర‌విడ్ భార‌త్ కు అనేక అద్భుత‌మైన విజ‌యాలు అందించారు. అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో ద్ర‌విడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 

ద్ర‌విడ్ 164 టెస్టు మ్యాచ్‌లలో 52.31 సగటుతో 13,288 టెస్ట్ పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న రికార్డు రాహుల్ ద్ర‌విడ్ పేరు మీద ఉంది.  తన 16 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 'ది వాల్' గా గుర్తింపు సాధించిన ద్ర‌విడ్  36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు కొట్టాడు.

Alastair Cook

5. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్) : 

అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో ఇంగ్లాండ్ లెజెండ్ అలిస్ట‌ర్ కుక్ ఐదో స్థానంలో ఉన్నాడు. అలిస్టర్ కుక్ త‌న టెస్టు కెరీర్ లో 161 మ్యాచ్ ల‌ను ఆడి 12,472 పరుగులు చేశాడు.  ఇంగ్లండ్ త‌ర‌ఫున టెస్ట్‌లలో అత్యంత విజయవంతమైన ఎడమచేతి వాటం బ్యాటర్ గా గుర్తింపు సాధించాడు.

అలిస్ట‌ర్ కుక్ త‌న టెస్టు కెరీర్ లో 33 సెంచ‌రీలు, 57 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. ఇక వ‌న్డే క్రికెట్ లో 3204 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 19 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా, ప్ర‌స్తుతం ఆడుతున్న‌ క్రికెటర్లలో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఈ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ 145 మ్యాచ్‌ల్లో 12,274 పరుగులు చేశాడు.

click me!