త‌న పక్కన కూర్చోవడానికి చాలా సిగ్గుపడే ధోనీకి కెప్టెన్సీ ఇచ్చిందే అత‌ను

First Published Sep 14, 2024, 7:37 PM IST

Sachin Tendulkar - MS Dhoni : ఎంఎస్ ధోని భార‌త క్రికెట్ చ‌ర‌త్రలో లెజెండ‌రీ కెప్టెన్. ప్ర‌పంచ క్రికెట్ లో స‌చిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ గా గుర్తింపు సాధించి లెజెండ్ బ్యాట‌ర్. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో కలిసి భార‌త జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించారు. 

Sachin Tendulkar - MS Dhoni

భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో విజయ శిఖరాలను అధిరోహించారు. మూడు క్రికెట్ ఫార్మాట్లలలో భారత జట్టును నెంబర్ వన్ గా నిలబెట్టి, ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుని కొత్త శకానికి నాంది పలికాడు. వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఘనత సాధించాడు.

Sachin Tendulkar - MS Dhoni

2007లో తొలిసారిగా భారత జట్టు కెప్టెన్‌గా ధోనీ నియమితుడయ్యాడు. ధోనీని కెప్టెన్‌గా నియమించడంలో భారత జట్టు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో తన పక్కన కూర్చోవడానికి సిగ్గుపడే ధోనికి 2007లో సచిన్‌ టెండూల్కర్ నుంచి కెప్టెన్సీ వచ్చింది. ముందుగా భారత జట్టు పగ్గాలను బీసీసీఐ సచిన్ అప్పగించాలని భావించింది. ఇదే విషయాన్ని చెప్పగా, సచిన్ తనకు కెప్టెన్సీ వద్దని, ధోనీ పేరును సూచించాడు. ఆ విధంగా ధోని భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. 

ఆ తర్వాత తిరుగులేని కెప్టెన్ గా ఎదిగాడు. 2007 లో టీ20 ప్రపంచ కప్ ను ధోని కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది. 2009లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2011లో వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని భారత జట్టుకు అందించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 22 ఏళ్ల కల ధోనీ ద్వారా నెరవేరింది. ఆ ట్రోఫీ సచిన్‌కు అంకితం చేశారు. సచిన్ ఒకటి కంటే ఎక్కువ తరాల ఆటగాళ్లను ప్రేరేపించాడు.

Latest Videos


Sachin Tendulkar - MS Dhoni

సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడటం చూసి చాలా మంది క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అలాంటి వారిలో ధోని కూడా ఒకరు. అయితే ఒకానొక సమయంలో సచిన్‌తో సమయం గడపడానికి ధోనీ ఇష్టపడలేదు. అతనితో సమావేశాన్ని కూడా తప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన క్రికెటర్, లెజెండరీ ప్లేయర్ తో ధోని సమయం గడపడం నుంచి ఎందుకు తప్పించుకున్నాడనే విషయాలను గురించి మాస్టర్ బ్లాస్టర్ తాజాగా వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

ఈ విషయంపై జియో ఇన్‌సైడర్‌తో మాట్లాడిన సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ఆరంభంలో ధోనీ చాలా సిగ్గుపడేవాడని, తన సీటును మార్చుకునేవాడని చెప్పాడు. "నేను బంగ్లాదేశ్‌లో అతన్ని కలిశాను. ఒక మ్యాచ్‌లో ఆఖర్ లో ఆయన ఒకటి రెండు షాట్లు ఆడాడు. అతను బ్యాట్ స్వింగ్ చేసినప్పుడు బ్యాట్ నుండి వచ్చే శబ్దం నన్ను ఆశ్చర్యపరిచింది. దీంతో నేను సౌరవ్ గంగూలీతో చెప్పానని అన్నారు. ఇలాంటి గొప్ప హిట్టర్లకు ఈ ప్రత్యేకత ఉంటుంది. అది ధోనీకి కూడా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను దాన్ని చూశాను. విమానంలో ప్రయాణించేటప్పుడు అతని సీటు, నా సీటు పక్కపక్కనే ఉంటాయి. అయితే, ధోనీ దానిని ఇతర ఆటగాళ్లతో మార్చుకునేవాడు. నా పక్కన అతను కూర్చోలేదు" అని అన్నారు. అప్పట్లో ధోని తన వద్ద చాలా సిగ్గుపడుతూ కనిపించే వాడని పేర్కొన్నారు. 

Sachin Tendulkar - MS Dhoni

కాగా, ధోనీ కెప్టెన్సీలో సచిన్ టెండూల్కర్ 6 సంవత్సరాలు ఆడాడు. 2012 డిసెంబర్‌లో సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత నవంబర్ 2023లో సచిన్ తన చివరి మ్యాచ్‌ను వాంఖడే స్టేడియంలో ధోనీ కెప్టెన్సీలో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇద్దరూ కలిసి ఆడినప్పటికీ, ఐపీఎల్‌లో ఇద్దరూ కలిసి ఆడలేదు. 2010 ఐపీఎల్ ఫైనల్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, సచిన్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.

కాగా, అంత‌ర్జాతీయ క్రికెట్ లో స‌చిన్ టెండూల్క‌ర్ అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా  రికార్డు సృష్టించాడు. అలాగే, అంత‌ర్జాతీయ క్రికెట్ లో 100 సెంచ‌రీలు సాధించిన ఏకైక ప్లేయ‌ర్. భార‌త్ అనేక అద్భుత విజ‌యాలు అందించారు. భార‌త్ లోనే కాకుంగా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. క్రికెట్ గాడ్ గా గుర్తింపు సాధించాడు. త‌న అంత‌ర్జాతీయ‌ క్రికెట్ కెరీర్ లో స‌చిన్ టెండూల్క‌ర్ వ‌న్డేల్లో 18426 ప‌రుగులు, టెస్టు క్రికెట్ లో 15921 ప‌రుగులు చేశారు.

click me!