South Africa vs India Series: టీ20 సిరీస్‌కు ముందే దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..

First Published | Dec 9, 2023, 3:57 PM IST

SA vs IND T20I Series: డిసెంబర్ 10 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్  ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్ప‌టికే టీమిండియా దక్షిణాఫ్రికా చేరుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్‌లో జరగనుంది.
 

Team India

South Africa vs India T20I: భారత్‌తో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌కు ముందే దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ త‌గిలింది. ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో అద‌ర‌గొట్టిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి ఈ సిరీస్ కు దూర‌మ‌య్యాడు. 
 

lungi ngidi

లుంగి ఎంగిడి చీలమండ బెణుకు కారణంగా భారత్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ201 సిరీస్‌కు దూరమయ్యాడు. లుంగీ ఎన్‌గిడి వైద్య బృందం ఆధ్వర్యంలోనే ఉన్నార‌ని  సౌతాఫ్రికా క్రికెట్ వ‌ర్గాలు తెలిపాయి. 
 


lungi ngidi

అయితే, ఈ సిరీస్ ప్రారంభం కాకముందే స్టార్ బౌల‌ర్ దూరం కావ‌డం దక్షిణాఫ్రికాకు ఓ చేదువార్త అనే చెప్పాలి. లుంగి ఎంగిడి ఎడమ చీలమండలో బెణుకు కారణంగా టీ20 సిరీస్‌కు దూరం కాగా, ఇక భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో కూడా  లుంగి ఎంగిడి పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది.
 

South Africa fast bowler Ngidi

లుంగి ఎంగిడి గాయపడటంతో ఫాస్ట్ బౌలర్ బురాన్ హెండ్రిక్స్ సౌతాఫ్రికా జట్టులోకి వచ్చాడు. ఇది కాకుండా, ఒట్నియల్ బార్ట్‌మన్, నాండ్రే బెర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, లిజాడ్ విలియమ్స్ కూడా జట్టులో ఉన్నారు. 
 

Lungi Ngidi

ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడకు విశ్రాంతినిచ్చారు. ఇక లుంగి ఎంగిడీని మినహాయించడం వల్ల దక్షిణాఫ్రికా బౌలింగ్ బలహీనంగా మారిందని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. 

india cricket

భార‌త్ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా పర్యటన డర్బన్ నుండి ప్రారంభమవుతుంది. రెండో టీ20 మ్యాచ్‌ గ్కెబెర్హాలో, మూడో టీ20 జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 17 నుంచి 21 వరకు భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీని తర్వాత, రెండు టెస్టులు సిరీస్ జ‌ర‌గ‌నుంది. మొదటిది డిసెంబర్ 26న, రెండో టెస్టు జ‌న‌వ‌రి 3న జ‌ర‌గ‌నుంది.
 

Latest Videos

click me!