ICC T20 Rankings: టీ20ల్లో నెంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ గా సూర్యకుమార్ యాదవ్..

First Published | Dec 6, 2023, 8:23 PM IST

Suryakumar Yadav: బౌలింగ్ విభాగంలో ర‌వి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరుపులు మెరిపించగా, సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో టాప్ ర్యాంక్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. అత‌ని సారథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
 

ICC T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్  లో భార‌త ప్లేయ‌ర్స్ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం టీ20 క్రికెట్ అన్ని ఫార్మాట్ ల‌లో భార‌త ఆట‌గాళ్లు టాప్ లో కొన‌సాగుతున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
 

సూర్యకుమార్ తో పాటు రితురాజ్ గైక్వాడ్ కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ప్ర‌స్తుతం టీ20 ర్యాంకింగ్స్ లో టాప్-5లో టీమిండియా ప్లేయ‌ర్ సూర్యకుమార్ యాదవ్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో మహ్మద్ రిజ్వాన్ (పాక్), ఐడెన్ మార్క్రామ్ (సౌతాఫ్రికా), బాబర్ ఆజం (పాక్), రిలీ రోసోవ్ (సౌతాఫ్రికా)లు ఉన్నారు.
 


ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని టీమిండియా కౌవ‌సం చేసుకుంది. ఈ సిరీస్ లో సూర్య‌కుమార్ యాద‌వ్ అత్య‌ధిక స్కోర్ సాధించిన రెండో ప్లేయ‌ర్ గా నిలిచాడు. 
 

టీ-20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దీంతో పాటు టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. గైక్వాడ్ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ 16 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్‌కు చేరుకున్నాడు
 

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 272 పాయింట్లతో టీ-20 ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ 210 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
 

వ‌న్డేల‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్లలో షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Latest Videos

click me!