ఐసీసీ బెస్ట్ ప్లేయ‌ర్ ఆవార్డు రేసులో మహమ్మద్ షమీ.. మనకే దక్కేనా..

First Published | Dec 7, 2023, 9:31 PM IST

Mohammed Shami: ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు 9 మందిని ఏంపిక చేయ‌గా, వారిలో మ‌హ్మ‌ద్ ష‌మీ కూడా ఉన్నారు. కేవలం 6 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టి అద‌ర‌గొట్టాడు.
 

Mohammed Shami

ICC Player of the Month award: నవంబర్ లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీలను ఐసీసీ వెల్లడించింది. ఊహించినట్లుగానే మెన్ ఇన్ ఎల్లో ఆసీస్ జట్టు ఆరో ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకోవడంలో కీల‌క పాత్ర పోషించిన ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చోటు దక్కించుకోగా, ఒక భారత స్టార్ ప్లేయర్ కూడా చోటు దక్కించుకున్నాడు. 
 

Mohammed Shami

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్  (నవంబర్) అవార్డుకు నామినీలను ఐసీసీ ప్ర‌క‌టించ‌గా, అందులో భార‌త స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ చోటుద‌క్కించుకున్నారు. 
 


Mohammed Shami

ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు 9 మందిని ఏంపిక చేయ‌గా, వారిలో మ‌హ్మ‌ద్ ష‌మీ కూడా ఉన్నారు. కేవలం 6 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టి అద‌ర‌గొట్టాడు.
 

Glenn Maxwell

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీలలో కంగారు జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు గ్లెన్ మ్యాక్స్ వెల్, ట్రావిస్ హెడ్ లు కూడా చోటుద‌క్కించుకున్నారు. దీంతో ఆసీస్ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌తో మహ్మద్ షమీ ఐసీసీ నవంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పోటీ ప‌డుతున్నాడు.
 

Glenn Maxwell

గ్లెన్ మాక్స్‌వెల్ నవంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై డబుల్ సెంచరీని చేశాడు. అలాగే, ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో విజయవంతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇంకా, ప్రపంచ కప్ ముగిసిన వెంటనే భారత్‌తో జరిగిన టీ20 సిరీస్ లో గ్లెన్ సెంచరీతో అద‌ర‌గొట్టాడు.
 

Travis Head

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీగా ఉన్న మ‌రో ప్లేయ‌ర్ ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే, ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ త‌న అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో కంగారుల‌కు మ‌ర్చిపోలేని విజ‌యాన్ని అందించాడు.  దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో హెడ్ 137 (120) పరుగులు చేయ‌గా, ఇందులో 15 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
 

Mohammed Shami

ఈ ముగ్గుర్లు ప్లేయ‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, ట్రావిస్ హెడ్ ల‌లో న‌వంబ‌ర్ నెల‌కు గానూ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంద్ ఆవార్డు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి. మ‌హ్మ‌ద్ ష‌మీకి అవార్డు రావాల‌ని భార‌త క్రికెట్ ప్రియులు కోరుకుంటున్నారు. 

Latest Videos

click me!