Romario Shepherd: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్, ఆర్సీబీ స్టార్ రొమారియో షెపర్డ్ అరుదైన ఘనత సాధించాడు. కేవలం ఒకే బంతికి 22 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ రొమారియో షెపర్డ్ ఒకే బంతికి ఏకంగా 22 పరుగులు సాధించాడు.
సెయింట్ లూసియా కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రికార్డు సాధించాడు.
DID YOU KNOW ?
రొమారియో షెపర్డ్ ఐపీఎల్ కెరీర్
షెపర్డ్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (2022), లక్నో సూపర్ జెయింట్స్ (2023), ముంబై ఇండియన్స్ (2024) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
25
ఒకే బాల్ కు 22 పరుగులు ఎలా వచ్చాయి?
15వ ఓవర్‌లో బౌలర్ ఒషానే థామస్ వేసిన మూడో బంతి నోబాల్‌గా తేలింది. షెపర్డ్ ఆ బంతికి రన్స్ చేయలేదు. దీని తర్వాత ఫ్రీహిట్ ను వైడ్ వేశాడు. ఆ తర్వాత వేసిన బంతి కూడా ఫ్రీహిట్ కాగా, షెపర్డ్ సిక్స్‌గా మలిచాడు. మరుసటి బంతి కూడా నోబాల్‌గా తేలింది. షెపర్డ్ దాన్నీ కూడా బౌండరీ దాటించాడు. చివరికి లీగల్‌గా వేసిన బంతినీ స్టేడియం పైకప్పుపైకి సిక్స్‌గా కొట్టాడు. ఇలా ఒకే బంతి నుండి 22 పరుగులు వచ్చాయి.
35
రొమారియో షెపర్డ్ మెరుపు ఇన్నింగ్స్
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రొమారియో షెపర్డ్ 34 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి. అతని పవర్ హిట్టింగ్‌తో వారియర్స్ జట్టు స్కోరు 200 దాటింది. కానీ ఈ అద్భుత ఇన్నింగ్స్ కూడా విజయం అందించలేకపోయింది.
గయానా అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ 33, షై హోప్ 23, బెన్ మెక్‌డెర్మాట్ 30 పరుగులు చేశారు. కానీ 203 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలోనే ఛేదించింది.
ఓపెనర్ అకీమ్ ఆగస్టే 35 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. కింగ్స్ జట్టు 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
55
క్రికెట్ లో అరుదైన రికార్డు
ఒకే బంతికి 22 పరుగులు సాధించడం క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనత. ఇది షెపర్డ్‌ను పవర్ హిట్టర్‌గా మరోసారి నిరూపించింది.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరఫున అతను 14 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు CPLలోనూ తన హిట్టింగ్‌తో మరోసారి క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.