Virat Kohli, RohitSharma
Kohli-Rohit-Gavaskar : దులీప్ ట్రోఫీ 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాల్గొనకపోవడంపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కీలక బ్యాట్స్‌మెన్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే పాల్గొంటారని అన్నారు.
Kohli-Rohit
అయితే, భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చినందుకు గవాస్కర్ ప్రశంసించాడు. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం సానుకూల అంశంగానే పేర్కొన్నారు. కానీ, విరాట్, రోహిత్ లను ఎంపిక చేయాల్సిందని అన్నారు.
రోహిత్-విరాట్‌లు దేశవాళీ మ్యాచ్‌లకు ఎంపికై ఉండాల్సింది ఎందుకంటే మ్యాచ్ సమయాన్ని పొందే అవకాశముండేదనీ, వారి ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశముండేదని అభిప్రాయపడ్డారు. క్రీడాకారుడు 30 ఏళ్లు దాటినప్పుడు కండరాలు బలహీనపడకుండా ఉండాలంటే నిత్యం ప్రాక్టీస్ లో ఉండాలని అన్నారు.
Virat Kohli-Rohit Sharma
మిడ్-డేలో సునీల్ గవాస్కర్ కాలమ్‌లో.. "సెలెక్టర్లు దులీప్ ట్రోఫీకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఎంచుకోలేదు. కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనున్నాడు. కానీ, బ్యాట్స్‌మెన్ పిచ్‌పై కొంత సమయం గడపాలి. ఒక క్రీడాకారుడు ఏదైనా క్రీడలో 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత, సాధారణ పోటీలు అతను నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలను కొనసాగించడంలో సహాయపడతాయి" అని పేర్కొన్నారు.
Image credit: PTI
కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2012, 2016లో తమ చివరి హోమ్ మ్యాచ్‌లు ఆడారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ 58, 64, 35 పరుగులు చేయగా, కోహ్లీ వరుసగా 24, 14, 20 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. జనవరి 2024లో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు ఆడాడు. అక్కడ 46, 12 పరుగులు చేశాడు.