Virat Kohli, Rohit Sharma
Virat Kohli-Rohit Sharma : భారత దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ తో భారత జట్టు నుంచి అరంగేట్రం చేశాడు. అయితే, తొలి మ్యాచ్ లో పెద్ద స్కోర్ చేయని కోహ్లీ 22 బంతుల్లో 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇందులో ఒక బౌండరీ ఉంది. కానీ, ఇప్పుడు కింగ్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో గొప్ప ప్లేయర్ గా కొనసాడుతున్నాడు.
Virat Kohli-Rohit Sharma
అంతర్జాతీయ క్రికెట్ లో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురింపించాడు. కోహ్లీ క్రికెట్ అభిరుచి, ఆకలి సాటిలేనివిగా పేర్కొన్నాడు. గ్రౌండ్ లో యమ యాక్టివ్ గా ఉంటే కింగ్ కోహ్లీ బ్యాట్, ఫీల్డింగ్ తోనే కాకుండా తనదై నడవడితో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంటాడు. ఆటగాళ్లకు గొప్ప శక్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. గ్రౌండ్ లో ఇలా జట్టు విజయం కోసం నడుచుకునే అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకరంటూ కోహ్లీపై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. అతని పోరాటం అపారమైనదని తెలిపాడు.
Virat Kohli-Rohit Sharma
"కోహ్లీ క్రికెట్ ఆకలి, అభిరుచి సాటిలేనివని మనందరికీ తెలుసు. మీరు అతన్ని చూసిన ప్రతిసారీ, అతను అన్ని సమయాలలో విభిన్న శక్తితో బయటకు వస్తాడు. అతను జట్టుకు దగ్గర అనేక విషయాలు తీసుకువస్తాడు. ఆటగాళ్లకు శక్తిని పంచుతాడు. టీమిండియా కోసం అతను ఆడిన ఇన్నింగ్స్ లు ఎప్పటికీ మర్చిపోలేనివి" అని రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.
Deadline
అలాంటి ఆట ఎక్కడ దరొకదని పేర్కొన్న రోహిత్ శర్మ.. చాలా పోరాటాలు, కఠినమైన పరిస్థితుల ఎదర్కొనడంతో ఇలాంటి ఇన్నింగ్స్ లు వస్తాయని కోహ్లీ ఆటను గుర్తుచేశారు. తన బెస్టు ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్న చేస్తూనే ఉంటారనీ, కోహ్లీని చూసిన ప్రతిసారీ అతని ఆట వేరే స్థాయిలో ఉన్నట్లు అనిపిస్తుందని రోహిత్ పేర్కొన్నాడు.
Virat Kohli-Rohit Sharma
కాగా, ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ 16 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను పూర్తి చేసుకునే క్రమంలో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక 2024లో ప్రపంచ కప్ విజయంతో తన టీ20I కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం భారత వన్డే, టెస్టు జట్టులో కొనసాగుతున్నాడు. 35 ఏళ్ల కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. ముంబైలో జరిగిన ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై తన 50 వ వన్డే సెంచరీని సాధించాడు.