ఆర్సీబీ కాకుండా విరాట్ కోహ్లీకి ఐపీఎల్ లో ఏ టీమ్ ఇష్ట‌మో తెలుసా?

First Published | Aug 19, 2024, 5:36 PM IST

Virat Kohli's favourite IPL team : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి 16 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ లో ఆర్సీబీ కాకుండా త‌న‌కు ఇష్ట‌మైన ప్రత్యర్థి జ‌ట్టు ఏదో చెప్పాడు.. !
 

Virat Kohli's favourite IPL team : విరాట్ కోహ్లీ.. అంత‌ర్జాతీ క్రికెట్ లో అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డంతో పాటు కొత్త రికార్డులు సృష్టించిన దిగ్గ‌జ ప్లేయ‌ర్. త‌న కెరీర్ తొలి మ్యాచ్ కేవ‌లం 12 ప‌రుగుల‌కే ఔట్ అయిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ స్టార్ ప్లేయ‌ర్ ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) త‌ర‌ఫున ఆడుతున్నాడు. ప్రతి సీజన్‌లో ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించే ఏకైక ఆటగాడిగా ఎలైట్ రికార్డును కలిగి ఉన్నాడు.  

Virat Kohli-Rohit Sharma

విరాట్ కోహ్లీ 2008 లో రూకీగా ఆర్సీబీ ఫ్రాంచైజీలో చేరాడు. ఆరంభంలో ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డినా ఆర్సీబీ అత‌నికి అండ‌గా నిలిచింది. ఆరంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆర్సీబీతోనే ప్ర‌యాణిస్తున్నాడు. విరాట్ 2013లో వారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాడు. ఐపీఎల్ లోనూ అనేక రికార్డులు సృష్టించాడు. విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్ లో 16 సంవ‌త్స‌రాల కెరీర్ ను పూర్తిచేశాడు. ఈ క్ర‌మంలోనే స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఐపీఎల్ లో ఆర్సీబీ కాకుండా త‌న‌కు ఇష్ట‌మైన టీమ్స్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

Latest Videos


విరాట్ తన అభిమాన ఐపీఎల్ ప్రత్యర్థిగా రోహిత్ శ‌ర్మ టీమ్ ముంబై ఇండియన్స్ ను ఎంచుకుంటార‌ని భావించారు. ధోని టీమ్ సీఎస్కే ను కూడా కాద‌ని చెబుతూ.. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ను త‌న‌కు ఇష్ట‌మైన ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుగా కింగ్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏప్రిల్ 18, 2008న ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరిగిన మొట్టమొదటి  ఐపీఎల్ మ్యాచ్ లో విరాట్ భాగమయ్యాడు. సౌరవ్ గాగులీ నేతృత్వంలోని జట్టు మొత్తం 222 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 82 పరుగులకే ఆలౌట్ తో ఘోరంగా ఓడిపోయింది. విరాట్ 5 బంతుల్లో 1 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇక 20 ఏప్రిల్ 2018న ముంబై ఇండియన్స్‌తో విరాట్ తన మొదటి  ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆర్సీబీ 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో కింగ్ కోహ్లీ 14 బంతుల్లో 23 పరుగులు చేశాడు. కాగా, ఆర్సీబీ ఐపీఎల్ ఫైన‌ల్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు కూడా ముంబై గానీ, కేకేఆర్ ను గానీ ఎదుర్కోలేదు.

Virat Kohli

కేకేఆర్ పై విరాట్ కోహ్లీ 34 మ్యాచ్‌లు ఆడి 962 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక‌ ముంబై ఇండియన్స్‌పై 33 మ్యాచ్‌లు ఆడి 855 పరుగులు చేశాడు. ముంబై  పై విరాట్ ఐదు అర్ధ సెంచరీలు చేశాడు.

Image credit: PTI

కాగా, విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొన‌సాగుతున్నాడు. 252 మ్యాచ్‌ల్లో 8004 పరుగులు చేశాడు. విరాట్ ఖాతాలో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ ఆర్సీబీ తో 3 ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడు కానీ ఒక్క‌సారి కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. రాబోయే సీజ‌న్ లో కూడా విరాట్ కోహ్లీ ఆర్సీబీ తో ఉండ‌నున్నాడు. 

click me!