రోహిత్-కోహ్లీ ప్లాప్ షో - బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టిన 10వ నంబర్ బ్యాట్స్‌మెన్

First Published | Oct 17, 2024, 8:13 PM IST

India vs New Zealand: బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టెస్టులో భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా 46 పరుగులకే ఆలౌటైంది. కీవీస్ బౌలింగ్ ముందు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు చేతులెత్తేశారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ స‌హా స్టార్ ప్లేయ‌ర్లు ప్లాప్ అయ్యారు. అయితే, బ్రియాన్ లారా రికార్డును 10వ నంబర్ బ్యాట్స్‌మెన్ బ‌ద్ద‌లు కొట్టాడు.  
 

Rohit Sharma, Virat Kohli

India vs New Zealand: టెస్టు క్రికెట్ రికార్డులను గ‌మ‌నిస్తే అందులో మొద‌ట‌గా క‌నిపించే పేర్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గ‌జం, మాజీ స్టార్ ప్లేయ‌ర్ బ్రియాన్ లారా త‌ప్ప‌కుండా క‌నిపిస్తారు. టెస్టు క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ కొత్త రికార్డులు సాధించాడు లారా. అతని ఒకే ఇన్నింగ్స్ లో 400 పరుగుల రికార్డును ఇప్పటివరకు ఒక్క క్రికెటర్ కూడా అందుకోలేకపోయాడు. 

అయితే, ఆధునిక క్రికెట్‌లో  బ్రియాన్ లారాను కొన్ని అంశాలలో అధిగ‌మించిన స్టార్ బ్యాట్స్‌మెన్లు కూడా ఉన్నారు. వారిలో ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న‌ విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు కనిపిస్తున్నారు. అయితే, వీరు మాత్ర‌మే కాకుండా ఒక ఫాస్ట్ బౌలర్ బ్రియాన్ లారా రికార్డును బ‌ద్ద‌లు కొట్టి సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ విష‌యం మీకు షాక్.. ఆశ్చర్యం క‌లిగించినా ఇది జ‌రిగింది.

India vs New Zealand, 1st Test

బ్రియాన్ లారాను అధిగ‌మించిన ఆ బౌల‌ర్ ఎవ‌రు?

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా క్రికెట్ లో ఏళ్ల తరబడి ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు అత‌ను సాధించిన ప‌లు రికార్డుల‌ను ఎవరూ టచ్ చేయలేకపోయారు. ఒకప్పుడు టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డులో లారా అగ్రస్థానంలో ఉండేవాడు, కానీ నేడు అతను చాలా వెనుకబడి ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ, వెటరన్ విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్‌లు లారా సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. కానీ, 11వ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ లారాను అధిగమించాడు. 


బ్రియాన్ లారా ఎన్ని సిక్సర్లు బాదాడు? 

బ్రియాన్ లారా తన టెస్టు క్రికెట్ కెరీర్‌లో 131 మ్యాచ్‌లలో 88 సిక్సర్లు సాధించాడు. టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్ల జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు. అయితే, ఇప్పుడు లారా సిక్స‌ర్ల రికార్డును న్యూజిలాండ్‌ ఆటగాడు టిమ్‌ సౌథీ అధిగ‌మించాడు. టీమ్ సౌథీ 102 మ్యాచ్‌ల్లో 89 సిక్సర్లు బాదాడు.

అత‌ను ఇప్పుడు భార‌త డాషింగ్ ఓపెన‌ర్, మాజీ క్రికెట్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్ల రికార్డుపై క‌న్నేశాడు. అయితే, బ్రియాన్ లారా రికార్డును భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బ‌ద్ద‌లు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోహిత్ శ‌ర్మ ఇప్పటి వరకు 61 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడి 87 సిక్సర్లు బాదాడు. 

టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్స‌ర్లు బాదిన క్రికెట్ ఎవ‌రు? 

టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టినవారిలో బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 106 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ 131 సిక్సర్లు బాదాడు. అయితే, స్టోక్స్ మినహా టాప్-5లో ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న ప్లేయ‌ర్లు ఎవ‌రూ ఈ లిస్టులో లేరు. 

టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో న్యూజిలాండ్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. మెకల్లమ్ తన కెరీర్ లో 101 టెస్టు మ్యాచ్ లను ఆడి 107 సిక్సర్లు బాదాడు. మెకల్లమ్ తర్వాత ఆస్ట్రేలియన్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 100 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 

Tim Southee

యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 98 సిక్సర్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఆల్ రౌండర్ జాక్ కల్లిస్ 97 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. టీమ్ సౌథీ 7, బ్రియాన్ లారా 8, కేయిర్న్స్ 9, రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నారు. 

ఇక న్యూజిలాండ్ తరఫున టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో 107 సిక్సర్లతో బ్రెండన్ మెకల్లమ్ టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత టిమ్ సౌథీ 89 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతున్న వారిలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ కూడా టిమ్ సౌథీనే. టిమ్ సౌథీ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. అతను రైట్ హ్యండ్ బ్యాటింగ్ తో పరుగులు కూడా చేయగల ప్లేయర్. 

Latest Videos

click me!