సానియా మీర్జా రెండో పెళ్లి - టర్కీలో టెన్నిస్ స్టార్ షికారు

First Published | Oct 15, 2024, 7:53 PM IST

Sania Mirza's second marriage : క్రికెట‌ర్  షోయబ్ మాలిక్ తో విడాకుల తర్వాత భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా రెండోసారి పెళ్లికి సిద్ధమవుతోందనే ఊహాగానాల మ‌ధ్య బాలీవుడ్ న‌టి పరిణీతి చోప్రా-ఆమె భర్త రాఘవ్ చద్దాతో సానియా మీర్జా టర్కీలో ఉన్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి.
 

Sania Mirza

Sania Mirza's second marriage: భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ అయిన షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్నప్పటి నుండి ఆమె ఒంటరిగా ఉంటున్నారు. షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. అతనిది మూడవ వివాహం. ఇక సానియా మీర్జా కూడా త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబుతున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వారి ఇంట్లో త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగుతాయ‌ని స‌న్నిహితులు పేర్కొంటున్నారు.

Sania Mirza's second marriage

పరిణీతి చోప్రాతో టర్కీలో సానియా మీర్జా

భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్ర‌స్తుతం ట‌ర్కీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోల‌ను సానియా సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. సానియాతో పాటు ఆమె స్నేహితులు ఉన్నారు. నటి పరిణీతి చోప్రా ప్రస్తుతం టర్కీలో తన స్నేహితుల వివాహ వేడుకలను జరుపుకుంటున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పరిణీతి తన భర్త-రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాతో ఉన్న ఫోటోల‌ను పంచుకున్నారు. వారితో పాటుటెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఉన్నారు. 

పరిణీతి, రాఘవ్ చద్దా సముద్రపు దృశ్యాన్ని ఆస్వాదిస్తూ పాదాలను చాచి కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది . వారు తమ ముఖాల చిత్రాలను పంచుకోలేదు కానీ వారి కాళ్ళ చిత్రాలను మాత్రమే పంచుకున్నారు. సానియా మీర్జా తన కుటుంబం-స్నేహితులతో సమయం గడిపిన సందర్భంలోని కొన్ని చిత్రాల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అందులో సానియా, పరిణీతి సాయంత్రం పడవపై కూర్చున్నట్లు ఒక ఫోటో చూపించింది. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ సానియాపైకి వాలిపోయింది పరిణీతి. 


Sania Mirza's second marriage

సానియా మీర్జా రెండో వివాహం అత‌నితోనేనా? 

సానియా మీర్జా ఇప్ప‌టికే షోయ‌బ్ మాలిక్ తో విడాకులు తీసుకున్నారు. షోయ‌బ్ మాలిక్ పాకిస్తాన్ న‌టి స‌నా జావేద్ ను వివాహం చేసుకున్నారు. షోయ‌బ్ మాలిక్ కు ఇది మూడో వివాహం కాగా, స‌నా జావేద్ కు రెండో వివాహం. ఇప్పుడు సానియా కూడా రెండో పెళ్లికి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. 

ప‌లు వీడియా నివేదిక‌ల ప్ర‌కారం..  షోయబ్ మాలిక్ ప్రస్తుత భార్య సనా జావేద్ మాజీ భర్తను సానియా మీర్జా పెళ్లి చేసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సనా గతంలో పాకిస్థానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. గాయకుడు ఇటీవల షేర్వాణిలో ఉన్న అతని చిత్రాలను పోస్ట్ చేశాడు, అతను సానియాతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడా?  లేక వేరేవారితోనా అనేది సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో వివాహం గురించి విష‌యాలు ఇంకా అధికారికంగా వారి కుటుంబం ఏలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

Sania Mirza's second marriage

మ‌హ్మ‌ద్ ష‌మీతో సానియా మీర్జా పెళ్లి పుకార్లు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి సానియా ఇటీవ‌ల‌ విడాకులు తీసుకున్న త‌ర్వాత షమీ-సానియా పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్ర‌మంలోనే శుభంకర్ మిశ్రాతో యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పుకార్లను తోసిపుచ్చాడు. ఇందులో వాస్త‌వం లేద‌నీ, త‌ప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. 

సానియాతో పెళ్లి గురించి వ‌స్తున్న పుకార్ల‌పై ష‌మీ మాట్లాడుతూ.. "ఇది చాలా వింతగా ఉంది. క‌ల్పిత వార్త‌లు.. బలవంతంగా వార్తలు వస్తున్నాయి. ఫోన్ ఓపెన్  చేస్తే ఫోటో క‌నిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం.. అయితే ఇలా ఎవరినీ ఇందులోకి లాగ‌డం ఇష్టం లేదు.. ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీ సరదా కోసం మీమ్‌లు ఇలా  చేస్తున్నారు.. కానీ అవి ఒక‌రి జీవితానికి సంబంధించిన‌వని గుర్తుంచుకోండి" అని అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సానియా కుటుంబ స‌భ్యులు కూడా పెళ్లి పుకార్ల‌ను కొట్టిపారేశారు. 

Parineeti Chopra

ఇదిలావుండగా, తన టర్కీ పర్యటనకు కొన్ని రోజుల ముందు పరిణీతి చోప్రా తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని రాఘవ్‌తో మాల్దీవులలో జరుపుకుంది. బీచ్‌లో సైకిల్ తొక్కడం నుండి చేయి చేయి కలిపి నడవడం వరకు, ఈ జంట సంతోషంగా-రిలాక్స్‌గా కనిపించారు. సెప్టెంబర్ 24, 2023న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్‌లో సన్నిహితులు-కుటుంబ సభ్యుల సమక్షంలో పరిణీతి-రాఘవ వివాహం చేసుకున్నారు. దీనికి వినోద పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు-రాజకీయ నాయకులు హాజరయ్యారు.

ప‌రిణీతి చోప్రా చివ‌రి సినిమాలో ఎప్పుడు క‌నిపించారు?

పరిణీతి చోప్రా చివరిగా అమర్ సింగ్ చమ్కిలాలో కనిపించింది, ఇందులో ఆమె దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి నటించింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దిల్జిత్ తన కాలంలో అత్యధికంగా అమ్ముడైన కళాకారుడు చమ్కిలా పాత్రను పోషించాడు. అమర్ సింగ్ చమ్కిలా భార్య అమర్‌జోత్ కౌర్ పాత్రలో పరిణీతి నటించింది.

Latest Videos

click me!