సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వయస్సులో రిటైర్ అయ్యారు. ఎంఎస్ ధోనీ 39 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ సమయానికి వరుసగా 40, 39 ఏళ్లకు చేరుకుంటారు. అయితే, కొత్త కెప్టెన్ గిల్ ఆధ్వర్యంలో యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తుండటంతో, సీనియర్లపై పోటీ తీవ్రంగా ఉంది.
ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్, కోహ్లీకి చివరి సిరీస్ కావచ్చని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, పీటీఐ నివేదిక ప్రకారం కోహ్లీకి 2027 వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశముంది, ఎందుకంటే ఆయన ఫిట్నెస్ అత్యుత్తమ స్థాయిలో ఉంది. రోహిత్ కూడా కోచ్ అభిషేక్ నాయర్ సహాయంతో ఫిట్నెస్‌పై దృష్టి పెడుతున్నప్పటికీ, అది సరిపోతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
భారత క్రికెట్ యంగ్ ప్లేయర్లతో కొత్త దశలోకి అడుగుపెడుతున్న వేళ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు పై చర్చలు మరింత కాకరేపుతున్నాయి.