Rohit Sharma buys Tesla Car: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్లా కారు కొన్నారు. హిట్ మ్యాన్ కొనుగోలు చేసిన టెస్లా మోడల్ Y కారుతో పాటు నెంబర్ ప్లేట్ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది.
భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ కారు కలెక్షన్‌లో మరో లగ్జరీ వాహనం వచ్చి చేరింది. అదే టెస్లా మోడల్ Y కారు. ఇది తన ఆధునిక డిజైన్‌తో పాటు ప్రత్యేక నంబర్ ప్లేట్ ‘MH01FB3015’తో అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ నంబర్ చాలా ప్రత్యేకం. రోహిత్ కుటుంబంలో సంబంధం కలిగి ఉంది.
25
కుటుంబ ప్రేమకు చిహ్నంగా ‘3015’ నంబర్
రోహిత్ శర్మ తన పిల్లల పుట్టిన తేదీలను కలిపి ఈ నంబర్ ప్లేట్‌ను తీసుకున్నారు. కుమార్తె సమైరా (30-12-2018), కుమారుడు ఆహాన్ (15-11-2024) పుట్టిన తేదీల నుంచి 30, 15 అంకెలను కలిపి ‘3015’గా నెంబర్ ను ఎంచుకున్నారు. రోహిత్ శర్మకు ఇది కేవలం ఒక సంఖ్య కాదు, తన కుటుంబం పై ప్రేమకు చిహ్నంగా నిలుస్తోంది. అలాగే, రోహిత్ లాంబోర్ఘిని ఉరస్ SE కారుపై కూడా ఇదే నెంబర్ ఉంది.
35
రోహిత్ గ్యారేజీలో లగ్జరీ కారు కలెక్షన్
రోహిత్ శర్మకు లగ్జరీ వాహనాలంటే ఎంతో ఇష్టం. ఆయన గ్యారేజీలో ఇప్పటికే BMW M5 (F1 Edition), మెర్సిడెస్-బెంజ్ GLS 400d, టయోటా ఫార్చ్యూనర్, లాంబోర్ఘిని ఉరస్ SE వంటి హై-ఎండ్ వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు టెస్లా మోడల్ Y కూడా చేరి ఆయన కలెక్షన్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ముంబైలో రోహిత్ కొత్త టెస్లా కారు దర్శనమిచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి.
ధర: స్టాండర్డ్ మోడల్ ₹59.89 లక్షలు, లాంగ్ రేంజ్ వెర్షన్ ₹67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)
55
ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కొత్త లుక్ లో రోహిత్ శర్మ
అక్టోబర్ 19న భారత-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. అతని స్థానంలో శుభ్ మన్ గిల్ ను ఎంపికచేశారు. కాగా, హిట్ మ్యాన్ కొత్త టెస్లా కారు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పర్యావరణ అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కారును కొన్న తర్వాత అభిమానులు ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ రెండింటిలోనూ రోహిత్ ప్రేరణగా నిలుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.