బిగ్ షాక్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి సిరీస్‌..!

Published : Oct 05, 2025, 06:18 PM IST

Rohit Sharma Virat Kohli : భారత్ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వచ్చాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారనే చర్చ సాగుతోంది.

PREV
15
రోహిత్ శర్మ కు షాక్

భారత్ వన్డే క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ సారి పెద్ద నిర్ణయం తీసుకుంటూ రోహిత్ శర్మను కెప్టెన్ పదవి నుంచి తప్పించారు. 

యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమించారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ జట్టును సిద్ధం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ అగార్కర్ వెల్లడించారు.

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 7 నెలల విరామం తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్ గా నియమించారు. గిల్‌కు వన్డే నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలను బీసీసీఐ వెల్లడించింది.

25
రోహిత్–విరాట్ భవిష్యత్తు పై అనిశ్చితి? రిటైర్మెంట్ తీసుకుంటారా?

రాబోయే వన్డే వరల్డ్ కప్ ఆడాలనే ఉద్దేశాన్ని ఇప్పటికే పలుమార్లు విరాట్, రోహిత్ లు వెల్లడించారు. అయితే, ఈ మెగా టోర్నీలో ఇద్దరు స్టార్ల ఆటను చూడటం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జట్టులో ప్రస్తుతం యంగ్ ప్లేయర్లకు ప్రధాన్యత ఇవ్వడం చూడవచ్చు. 

అజిత్ అగార్కర్ ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్ వరకు ఆడుతారా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు. మీడియా రిపోర్టుల ప్రకారం, ఆస్ట్రేలియా పర్యటన ఈ ఇద్దరికీ చివరి సిరీస్ కావచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. వారు ఆడినంతకాలం జట్టుకు విలువైన సేవలు అందించినప్పటికీ, కొత్త తరం నాయకత్వాన్ని ఏర్పరచడంలో బీసీసీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వన్డే నాయకత్వంలోనూ ఆయన యుగం ముగిసినట్లే. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 56 వన్డేలలో 42 గెలిచింది. ఐసీసీ ట్రోఫీ, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ గెలుచుకుంది. విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు చెప్పాడు. కొంత కాలంగా కోహ్లీ రిటైర్మెంట్ అంశం హాట్ టాపిక్ గా మారింది.

35
గిల్‌కి బాధ్యతలు.. భారత జట్టులో యంగ్ జోష్

భారత్ వన్డే జట్టుకు 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ నాయకత్వం ఇచ్చారు. పలువురు కొత్త ప్లేయర్లు జట్టులోకి రావడంతో యంగ్ జోష్ కనిపిస్తోంది. 2027 వరల్డ్‌కప్‌లో గిల్ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుందని అగార్కర్ సూచించారు. 

ఆసీస్ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఉంటారు. బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ లకు ఈ సారి అవకాశం రాలేదు. విజయ్ హజారే ట్రోఫీ ముందు గాయాల కారణంగా హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ అందుబాటులో లేరు.

45
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు షెడ్యూల్

భారత్-ఆస్ట్రేలియా సిరీస్ అక్టోబర్ 19న మొదటి వన్డేతో ప్రారంభమవుతుంది. రెండో వన్డే అక్టోబర్ 23న, మూడో వన్డే అక్టోబర్ 25న జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

55
ఆస్ట్రేలియా సిరీస్ కోసం భారత జట్టు

వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), జైస్వాల్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, శివం దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వరుుణ్ చక్రవర్తి, రింకూ సింగ్.

Read more Photos on
click me!

Recommended Stories