Published : Oct 05, 2025, 04:57 PM ISTUpdated : Oct 05, 2025, 05:38 PM IST
India vs Pakistan: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ 2025లో భారత్–పాకిస్థాన్ పోరులో టాస్ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్, ఫాతిమా సనా ‘నో షేక్ హ్యాండ్’ తో వివాదం చెలరేగింది. పురుషుల జట్టుతో పాటు భారత మహిళల జట్టు కూడా పాక్ ప్లేయర్లతో చేతులు కలపలేదు.
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ పోరు మొదలైంది. కోలంబోలోని ఆర్. ప్రేమదాసా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. రెండు జట్లు ఒక్కొక్క మార్పుతో బరిలోకి దిగాయి. భారత జట్టులో అమన్ జోత్ స్థానంలో రేణుకా సింగ్ చోటు దక్కించుకున్నారు. పాకిస్థాన్ జట్టులో ఉమైమా సోహైల్ స్థానంలో సదఫ్ షమాస్ జట్టులోకి వచ్చారు.
25
IND vs PAK : మళ్లీ నో షేక్ హ్యాండ్ వివాదం
భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మస్తు క్రేజ్, ఉత్కంఠ, వివాదాలు కనిపిస్తుంటాయి. ఈ మ్యాచ్ లో కూడా మరో వివాదం మొదలైంది. టాస్ సమయంలో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పురుషుల మ్యాచ్ లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా భారత ప్లేయర్లు నో షేక్ హ్యాండ్ చెప్పారు.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో ఇక్కడ కూడా షేక్ హ్యాండ్ వివాదం మొదలైంది. ఇది ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025లో పురుషుల జట్టులో సూర్యకుమార్ యాదవ్ చేసినట్టుగానే ఇక్కడ హర్మన్ చేశారు. ఆ సమయంలో భారత పరుషుల జట్టు కూడా పాకిస్థాన్ ఆటగాళ్లతో చేతులు కలపకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అదే తీరును మహిళా జట్టు కూడా కొనసాగించడం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు దారితీసింది.
35
IND vs PAK : నో షేక్ హ్యాండ్ వివాదం ఎందుకొచ్చింది? దీని నేపథ్యం ఏంటి?
చాలా కాలం నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు గొప్పగా లేవు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత్ దాదాపు అన్ని సంబంధాలు పాక్ తో కట్ చేసుకుంది. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మద్దతుగా భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు ఒకే అభిప్రాయంతో పాక్ ప్లేయర్లతో చేతులు కలపలేదు. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లలోనూ ఆ ఉద్రిక్తతలు ప్రతిబింబించాయి.
భారత్–పాకిస్థాన్ మహిళా జట్లు 2005 నుండి ఇప్పటి వరకు 11 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అన్ని మ్యాచ్‌లను భారత జట్టే గెలుచుకుంది. పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క వన్డేలో కూడా విజయం సాధించలేకపోయింది. 2005లో కరాచీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 193 పరుగుల తేడాతో విజయం సాధించింది. తరువాతి అన్ని మ్యాచ్ లలోనూ భారత మహిళలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 2022లో మౌంట్ మౌంగనుయ్‌లో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.
55
ఆసియా కప్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్
ఆసియా కప్ లో షేక్ హ్యాండ్ వివాదంతో పాక్, భారత్ మ్యాచ్ లు ఉత్కంఠను రేపుతూ సాగాయి. ఈ టోర్నీలో భారత్ పూర్తి ఆధిపత్యం చూపించింది. పాకిస్థాన్‌పై వరుసగా మూడు విజయాలు సాధించి కప్ గెలుచుకుంది. ఇప్పుడు మహిళా జట్టుపై కూడా దేశవ్యాప్తంగా అభిమానుల్లో అదే ఉత్సాహం కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై డక్‌వర్త్ లూయిస్ విధానంలో 59 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు మంచి ఫామ్‌లో ఉంది. పాకిస్థాన్ మాత్రం బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.