రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రేసులో ముగ్గురు ఓపెనర్లు

Published : Oct 05, 2025, 03:34 PM IST

Rohit Sharma : ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మను బ్యాట్స్‌మన్‌గా తీసుకున్నారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, రోహిత్ స్థానం కోసం పోటీ పడుతున్న ముగ్గురు ఓపెనర్లు ఎవరు?

PREV
16
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత్ జట్టు.. రోహిత్ కు షాక్

ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ పర్యటనలో మూడు వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 19 నుంచి జరగనున్నాయి. రోహిత్ శర్మ షాకిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈసారి బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేయగా, యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. విరాట్ కోహ్లీ కూడా ఈ జట్టులో ఉన్నారు. రోహిత్ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వన్డేల్లో ఆయనకు చివరి సిరీస్ ఇదే కావచ్చనే చర్చ సాగుతోంది.

26
రోహిత్ శర్మ ఇక కెప్టెన్ కాదు !

రోహిత్ శర్మ ఇకపై భారత జట్టుకు ఏ ఫార్మాట్‌లోనూ కెప్టెన్‌ కాదు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరించిన హిట్ మ్యాన్.. ఇప్పటికే టీ20, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నారు. 

ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆయన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడనున్నారు. బీసీసీఐ నిర్ణయం ప్రకారం, ఆయన భవిష్యత్తులో వన్డేల్లో కూడా చాలా కాలం కొనసాగకపోవచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే ముందస్తు ప్లాన్స్ లో భాగంగా గిల్ కు కెప్టెన్సీ అప్పగించారని సమాచారం.

36
భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా గిల్

శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గత కొన్ని నెలల్లో అద్భుతమైన ఆటతో అదరగొట్టడంతో గిల్ ను ప్రమోషన్ లభించింది. బీసీసీఐ యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ గిల్‌పై నమ్మకం ఉంచింది. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో గిల్ తన సూపర్ బ్యాటింగ్, మంచి నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించాడు. అందుకే ఇప్పుడు అతన్ని వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా ఎంపిక చేశారు.

46
రోహిత్ స్థానాన్ని భర్తీకి ముగ్గురు ప్లేయర్ల పోటీ

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ రోహిత్ శర్మకు చివరిది కావచ్చనే చర్చ సాగుతోంది. నిజంగానే రోహిత్ ఆసీస్ తో చివరి సిరీస్ ఆడి రిటైర్ అయితే, ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత ఫామ్, ప్రదర్శన ఆధారంగా ముగ్గురు ఆటగాళ్లు ప్రధానంగా పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. వారే అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్.

అభిషేక్ శర్మ

అభిషేక్ శర్మ ఇటీవల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఆయన స్ట్రైక్ రేట్ 195 దాటింది. రోహిత్‌లా వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు అవకాశం రాకపోయినా, బీసీసీఐ త్వరలోనే ఆయనకు ఛాన్స్ ఇవ్వొచ్చని అంచనా. అభిషేక్ శర్మ ఫామ్ కొనసాగితే రోహిత్ స్థానాన్ని సులభంగా భర్తీ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అతను.

56
కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. రోహిత్ టెస్ట్‌ల నుంచి తప్పుకున్న తర్వాత ఈ బాధ్యత రాహుల్‌పై ఉంటుంది. వన్డేల్లో ఇప్పటివరకు ఆయన మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నా, ఓపెనింగ్‌లో కూడా అదరగొట్టగల ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. రాహుల్ 85 వన్డేల్లో 3043 పరుగులు సాధించాడు. ఆయన సగటు 49.08, స్ట్రైక్ రేట్ 88.18గా ఉంది. అలాగే, 7 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు.

66
యశస్వి జైస్వాల్

యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటికే తన స్థానం బలపరుచుకున్నాడు. వన్డేల్లో కూడా అదే స్థాయి ప్రదర్శనలు ఇవ్వగల సత్తా ఉన్న ప్లేయర్ అతను. పెద్ద ఇన్నింగ్స్ లు, ధనాధన్ నాక్ లు ఆడటంలో మంచి గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు ఆయన ఒకే వన్డే ఆడి 15 పరుగులు చేశాడు. అయినప్పటికీ, ఆయన ప్రతిభ రోహిత్ స్థానానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆయన భారత క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించినప్పటికీ, ఈ నిర్ణయం పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రోహిత్‌కు మద్దతుగా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories