IND vs ENG: ఇంగ్లాండ్ లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు, హర్మన్‌ప్రీత్ సెంచరీతో థ్రిల్లింత్ విక్టరీ కొట్టింది. దీంతో భారత్ ఇంగ్లాండ్‌పై 2-1తో సిరీస్ గెలుచుకుంది.
13 పరుగులతో మూడో వన్డేలో భారత్ గెలుపు.. సిరీస్ మనదే
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ వన్డేలో భారత్ ఉత్కంఠపోరులో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.
బుధవారం, చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీతో అదరగొట్టారు. ఇక బౌలింగో లో క్రాంతి గౌడ్ ఆరు వికెట్ల ప్రదర్శనతో మెరిశారు.
25
హర్మన్‌ప్రీత్ సెంచరీ.. 4000 పరుగుల మైలురాయి చేరారు
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 318/5 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ కొట్టారు. కేవలం 84 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగుల సెంచరీ నాక్ ఆడారు.
హర్మన్ ప్రీత్ కౌర్ ఈ సెంచరీ ఇన్నింగ్స్ తో 4000 వన్డే పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచారు. హర్మన్ కంటే ముందు మిథాలీ రాజ్, స్మృతి మంధానలు ఈ ఘనత సాధించారు.
35
చివరలో రిచా ఘోష్ మెరుపులు మెరిపించారు
ప్రతికా రావల్ (26 పరుగులు), మంధాన (45 పరుగులు) కలిసి 64 పరుగుల ప్రారంభ భాగస్వామ్యం అందించారు. హార్లిన్ డియోల్ (45 పరుగులు)తో కలిసి హర్మన్ ప్రీత్ కౌర్ 81 పరుగులు జోడించగా, జెమీమా రోడ్రిగ్స్ (50 పరుగులు)తో మరో 110 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. చివర్లో రిచా ఘోష్ 18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో స్కోరు 300 మార్కును దాటింది.
స్కివర్ బ్రంట్ పోరాటం వృథా.. గెలుపు దగ్గరగా వచ్చి ఓడిన ఇంగ్లాండ్
319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదటి రెండు వికెట్లు తక్కువ స్కోర్ కే కోల్పోయింది. క్రాంతి గౌడ్ తొలుత ఓపెనర్లను పెవిలియన్ పంపింది. ఆ తర్వాత ఎమ్మా ల్యాంబ్ (68 పరుగులు), కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ (98 పరుగులు) కలిసి 162 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ ను గెలుపు దిశగా తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
55
కాంతి గౌడ్, దీప్తిలు బ్రేక్ త్రూ అందించారు
శ్రీ చరణి ల్యాంబ్‌ను అవుట్ చేయగా, దీప్తి శర్మ స్కివర్ బ్రంట్‌ను 35వ ఓవర్‌లో అవుట్ చేసింది. అనంతరం అలిస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్ 34 బంతుల్లో 44 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను గెలుపు దిశగా నడిపినా, గౌడ్ మరోసారి ఆట మార్చింది. 48వ ఓవర్‌లో ఆమె వికెట్ తీసిన గౌడ్, చివరి ఓవర్‌లో లారెన్ బెల్‌ను ఔట్ చేసి భారత్ గెలుపు ఖరారు చేసింది. క్రాంతి గౌడ్ 6 వికెట్లు తీశారు.
కేవలం నాలుగవ వన్డేలోనే క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు తీసి దీప్తి శర్మ తర్వాత రెండో యువ భారత క్రికెటర్‌గా ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు సాధించింది. వీరికి ముందు పూర్ణిమా చౌదరి కూడా తన తొలి వన్డేలో ఈ ఘనత సాధించారు. కాగా, 2024 జనవరి తర్వాత భారత్ ఎనిమిదోసారి 300కి పైగా స్కోరు చేసింది.