రిష‌బ్ పంత్ వ‌చ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ మ‌స్తు ఖుషీ.. !

First Published Feb 8, 2024, 11:06 AM IST

Rishabh Pant: ఘోర కారు ప్ర‌మాదం నుంచి కొలుకున్న భార‌త స్టార్ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్ గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. రాబోయే ఐపీఎల్ సీజ‌న్ 2024లో ఆడ‌నున్నాడ‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 
 

Ricky Ponting, Rishabh Pant

Rishabh Pant - Ricky Ponting: క్రికెట్ ప్రియుల‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భార‌త్ స్టార్ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్ త్వ‌ర‌లోనే గ్రౌండ్ లో అడుగుపెట్ట‌బోన్నాడు. మ‌ళ్లీ అత‌ని ధ‌నాధ‌న్ బ్యాటింగ్, అద్భుత‌మైన‌ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ను మ‌ళ్లీ మైదానంలో చూడ‌బోతున్నాము. క్రికెట్ దిగ్గ‌జం రికీ పాంటింగ్ తాజాగా పంత్ అప్ డేట్స్ గురించి వెల్ల‌డించారు. 

Rishabh Pant

త‌న ఇంటికి వెళ్తుండగా ఘోర‌ కారు ప్రమాదానికి గుర‌య్యాడు రిష‌బ్ పంత్. ప్ర‌మాదం కారణంగా ఏడాదికి పైగా క్రికెట్ కు దూరమైన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రాబోయే ఐపీఎల్ కు ఫిట్ గా ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. పంత్ పూర్తి ఫిట్నెస్ తో ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బ్యాట్స్‌మెన్ గా మాత్రమే ఆడతాడ‌ని చెప్పాడు.

Rishabh Pant

రిషబ్ పంత్ ఐపీఎల్ ఆడేందుకు ఫిట్ గా ఉంటాడని ధీమా వ్యక్తం చేసిన పాంటింగ్.. బ్యాట్స్ మన్ గా లేదా వికెట్ కీపర్ గా అతను పూర్తి సామర్థ్యంతో ఉంటాడా అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వ‌లేదు. "ఇటీవ‌లి కొన్ని వైరల్ వీడియోలలో మీరు గమనించి ఉంటారు రిష‌బ్ పంత్ బాగా నడుస్తున్నాడు. అయితే, ఐపీఎల్ తొలి మ్యాచ్ కు ఇంకా ఆరు వారాల సమయం మాత్రమే" ఉంద‌న్నాడు.

Rishabh Pant

"పంత్ పునరాగమనం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము.. 14 మ్యాచు ల‌లో కనీసం 10 మ్యాచ్ ల‌లో రిష‌బ్ పంత్ ఆడినా అది జట్టుకు బోనస్ అవుతుంది. ఇదే స‌మ‌యంలో రిష‌బ్ పంత్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు" రికీ పాంటింగ్ తెలిపాడు.

Rishabh Pant

త‌న ప్ర‌మాదం గురించి ఇప్ప‌టికే రిష‌బ్ పంత్ స్పందిస్తూ.. ప్ర‌మాదం జ‌రిగిన క్ష‌ణాల్లో ఈ ప్ర‌పంచంలో త‌న ప్ర‌యాణం ముగిసింద‌ని అనుకున్నాన‌ని చెప్పాడు. ఈ ప్ర‌మాదం నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు పేర్కొన్నాడు.

Rishabh Pant

రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ గత 12-13 నెలల ప్రయాణం భయంకరమైన సంఘటన.. ప్రాణాలతో బయటపడటం తన అదృష్టమని అన్నాడు. రాబోయే ఐపీఎల్లో రిషబ్ పంత్ ఆడితే అది టీమ్ఇండియాకు కూడా ప్ల‌స్ అవుతుందని తెలిపాడు.

Rishabh Pant

ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడితే.. జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ క‌ప్ లో పంత్ ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నాడు. ఒకవేళ పంత్ ఐపీఎల్ కు దూరమైతే అతని గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నర్ సారథ్యం వహించనున్నాడు.

click me!