భారత్‌కు బిగ్ షాక్.. 3, 4వ టెస్టు నుంచి విరాట్ కోహ్లీ ఔట్? ఫైనల్ మ్యాచ్‌ ఆడటమూ అనుమానమే !

First Published | Feb 8, 2024, 9:40 AM IST

India vs England: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జ‌రిగిన‌ తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి జ‌ట్టులోకి రావ‌డంపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. 3, 4 టెస్టుల‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చున‌నీ, విరుష్క దంప‌తులు రెండో సంతానం కోసం ఎదురుచూస్తున్నారని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ആരാകും പകരക്കാരന്‍

India vs England - Virat Kohli : భార‌త-ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూర‌మ‌య్యాయ‌. అయితే, ఈ సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ ల‌కు కూడా అందుబాటులో వుండే అవ‌కాశాలు త‌క్కువేన‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

പിന്‍മാറ്റം അപ്രതീക്ഷിതം

మొద‌టి రెండు టెస్టుల‌కు దూర‌మైన విరాట్ కోహ్లీ 3, 4వ టెస్టులకు కూడా దూరం కానున్నాడని సమాచారం. దీంతో పాటు సిరీస్‌లో చివరిదైన 5వ టెస్టులో కూడా విరాట్ కోహ్లీ ఆడ‌టం అనుమానంగానే ఉంది.


Virat Kohli

3వ టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జ‌ర‌గ‌నుంది.  4వ టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది. భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో చివ‌రి టెస్టు మ్యాచ్ మ‌ర్చి  7 నుండి ధర్మశాలలో  జ‌ర‌గ‌నుంది. 

കോലി ഇപ്പോഴും സൂപ്പ‍ര്‍

సిరీస్ ప్రారంభానికి 3 రోజుల ముందు కోహ్లి తొలి 2 టెస్టులకు దూరంగా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. గురువారం లేదా ఈ వారంలో టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Virat Kohli

మూడు, నాలుగో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడ‌ని బీసీసీఐ లోని పలువురు పేర్కొంటున్నార‌ని స‌మాచారం. ఐదో టెస్టుకు ఆడ‌టం పై కూడా స్ప‌ష్ట‌త లేదు. విరాట్ కోహ్లీ సిరీస్ కు దూరం కావ‌డం భార‌త్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 

Rohit Sharma-Virat Kohli

గాయం కారణంగా 2వ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 3వ టెస్టుకు పునరాగమనం చేయనున్నారు. అలాగే 2వ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న పేసర్ మహ్మద్ సిరాజ్ 3వ టెస్టుకు అందుబాటులో ఉంటార‌ని స‌మాచారం.

Latest Videos

click me!