ఇర్ఫాన్ పఠాన్ భార్య సఫా బేగ్ ఎవ‌రో తెలుసా..? ఆస‌క్తిని క‌లిగించే విష‌యాలు ఇవిగో.. !

First Published | Feb 7, 2024, 4:52 PM IST

Irfan pathan-Safa Baig: టీమిండియా మాజీ స్టార్ బౌల‌ర్ ఇర్ఫాన్ పఠాన్ దంప‌తులు త‌మ‌ 8వ వివాహ వార్షికోత్సవం జ‌రుపుకున్నారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ తన జీవిత భాగస్వామి స‌ఫా బేగ్ తో ఫొటోల‌ను తొలిసారి పంచుకున్నాడు.

Irfan pathan, Safa Baig

Irfan pathan-Safa Baig: ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే అస‌లు ఎవ‌రీ స‌ఫా బెగ్ అంటూ నెటిజ‌న్లు ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ భార్య గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన 8వ వివాహ వార్షికోత్సవం సంద‌ర్భంగా భార్య సఫా బేగ్ చిత్రాల‌ను పంచుకుంటూ.. "అన్ని పాత్రలలో ప్రావీణ్యం సంపాదించిన ఆత్మ. నా మూడ్ బూస్టర్, హాస్యనటుడు, ఆటపట్టింపు, నిరంతర సహచరి, నా మంచి పిల్లలకు తల్లి. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను సృష్టించిన నా ప్రియమైన స‌ఫా బెగ్ కు 8వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు" అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు.


ఇర్ఫాన్ పఠాన్ 2016లో సఫా బేగ్‌ని పెళ్లాడాడు. వాస్తవానికి సౌదీ అరేబియా నుండి, సఫా బేగ్ ప్రొఫెషనల్ మోడల్‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. 

స‌ఫా బెగ్ 1994 ఫిబ్రవరి 28న జెడ్డాలో జన్మించారు. ఆమె జెడ్డాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 

సఫా బెగ్ గతంలో మోడల్ గా, జర్నలిస్ట్ గా పనిచేశారు. ఓ పీఆర్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తూ గల్ఫ్ లోని వివిధ ఫ్యాషన్ మ్యాగజైన్ల పేజీల్లో కూడా మెరిసింది.

సఫా బేగ్ ప్రఖ్యాత నెయిల్ ఆర్టిస్ట్ కూడా. ఇర్ఫాన్ పఠాన్‌ను పెళ్లాడినప్పుడు సఫాకు కేవలం 21 ఏళ్లు. ఇర్ఫాన్ పఠాన్-సఫా బేగ్ పెళ్లికి ముందు దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారని సమాచారం. 

ఇర్ఫాన్ పఠాన్, సఫా బేగ్ దంపతులకు ఇద్దరు కుమారులు. సఫా-ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు ఈ ఇద్దరు పిల్లలకు ఇమ్రాన్, సులైమాన్ అని పేరు పెట్టారు.

వారి 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ తన భార్య సఫా బేగ్ ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి క‌లిసి చూపించారు.

Latest Videos

click me!