Rinku Singh and Priya Saroj : భారత క్రికెట్ జట్టు స్టార్ యంగ్ ప్లేయర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. లక్నో నగరంలోని 5 స్టార్ హోటల్ ‘ది సెంట్రమ్’ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
25
చేతులు పట్టుకుని స్టేజీ పైకి వచ్చిన రింకూ సింగ్, ప్రియా సరోజ్
రింకూ, ప్రియా నిశ్చితార్థ వేడుకలో ఒకరినొకరు చేతులు పట్టుకుని స్టేజీ పైకి వచ్చారు. ఆ తర్వాత రింకూ సింగ్ ప్రియకు నిశ్చితార్థం రింగ్ పెట్టగా, ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలో రింకూ ఆమెను ఓదార్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
35
లైట్ పింక్ కలర్ లెహంగా చున్నీలో ప్రియా సరోజ్
నిశ్చితార్థ వేడుకలో ప్రియా సరోజ్ లైట్ పింక్ కలర్ లెహంగా చున్నీ ధరించగా, రింకూ క్రీమ్ కలర్ షేర్వానీలో దర్శనమిచ్చారు. ఈ జంట అద్భుతంగా కనిపించగా, ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ జంట ఆకర్షించింది.
ఈ వేడుకలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, ఎంపీ ఇక్రా హసన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దాదాపు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 300 మంది గౌరవ అతిథులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయగా, వీటిలో బార్కోడ్ స్కానింగ్ వ్యవస్థను అమలు చేశారు.
55
రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
సురక్షిత వాతావరణం కోసం హోటల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 గదులు ముందుగానే బుక్ చేయగా, వాటిలో 5 గదులు రింకూ సింగ్ స్నేహితుల కోసం కేటాయించారు.
ఈ వేడుకకు ముందు రింకూ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి వాలీ ఆలయంలో పూజలు నిర్వహించారు. కాగా, ప్రియా, రింకూ సింగ్ లు నవంబర్ 2025లో వివాహ బంధంతో ఒకటి కానున్నారు.