Diamond duck: డైమండ్ డక్ అంటే ఏమిటి? విరాట్ కోహ్లీ సహా 12 మంది భారత ఆటగాళ్ల రికార్డు ఇది !

Published : Jun 07, 2025, 09:15 PM IST

What is a diamond duck in cricket: డైమండ్ డక్ అనేది బంతిని ఎదుర్కోకముందే అవుట్ కావడం. వన్డేల్లో 164 మంది ప్లేయర్లు ఇలా అవుట్ అయ్యారు. ఈ లిస్టులో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
క్రికెట్ లో డక్ అంటే ఏమిటి?

Diamond duck in cricket: క్రికెట్‌లో "డక్" అనేది ఒక్క పరుగు కూడా చేయకపోవడం (జీరో పరుగులు) అని అర్థం. ఇందులోనే అత్యంత అరుదైన రూపం డైమండ్ డక్. డైమండ్ డక్ అంటే ఆటగాడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకముందే అవుట్ అవడం. 

25
క్రికెట్ డైమండ్ డక్

ఇది సాధారణంగా రన్ అవుట్ రూపంలో జరుగుతుంది. ముఖ్యంగా నాన్-స్ట్రైకర్‌గా ఉన్న బ్యాటర్, బంతిని ఎదుర్కోకముందే రన్నింగ్‌లో అవుటవుతాడు. కొన్ని సందర్భాల్లో స్ట్రైకర్ కూడా బంతిని ఆడకుండానే అవుటయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉదాహరణకు స్ట్రైకింగ్ ఎండ్ వద్ద బాల్ తగలడం వల్ల అవుట్ కావడం.

"డక్" అనే పదం నంబర్ "0" ఆకారాన్ని బాతు గుడ్డు ఆకారంతో పోల్చడంతో వాడుకలోకి వచ్చింది. క్రికెట్ లో డక్‌లలో కూడా పలు రకాలున్నాయి. 

35
క్రికెట్ లో డక్ ఎన్ని రకాలు?

గోల్డెన్ డక్: ఆటగాడు తొలి బంతికే అవుట్ అవడం

ప్లాటినమ్ డక్: ఇన్నింగ్స్‌లో తొలి బంతికే అవుట్ కావడం

డైమండ్ డక్: ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే అవుట్ కావడం

ఈ డైమండ్ డక్‌ మరింత బాధాకరమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కబంతిని కూడా ఆడకుండానే పెవిలియన్ కు చేరడం అంటే ఏ ప్లేయర్ కు అయినా చాలా కష్టంగా అనిపించే విషయం. దీని కారణంగా బ్యాటింగ్‌లో భాగస్వామ్యం రూపొందించే ముందు, జట్టు మోమెంటం దెబ్బతినే ప్రమాదం కలుగుతుంది. విశ్లేషణలు, కామెంటరీల్లో దీనిని ఒక నిర్దిష్ట ఒత్తిడిని సూచించే పాయింట్ గా వాడతారు.

45
భారత ఆటగాళ్లలో 12 మంది డైమండ్ డక్‌ గా అవుట్ అయ్యారు

ఈ అరుదైన డిస్మిస్సల్‌ ఇప్పటివరకు వన్డేల్లో 164 మంది ఆటగాళ్లకు కలిగింది. భారత ఆటగాళ్లలో 12 మంది డైమండ్ డక్‌కు గురయ్యారు. వీరిలో విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్ (రెండుసార్లు), రోజర్ బిన్నీ, హర్భజన్ సింగ్, అబే కురువిళ్ల, ఎంఎస్కే ప్రసాద్, వేంకటపతి రాజు, చేతన్ శర్మ, నవజోత్ సింగ్ సిద్దూ, శ్రీశాంత్, జవగల్ శ్రీనాథ్ వంటి ప్రముఖులు ఉన్నారు.

55
మొట్టమొదటి మైమండ్ డక్ ఎప్పుడు జరిగింది?

టెస్ట్ క్రికెట్‌లో మొట్టమొదటి డైమండ్ డక్‌ 1889లో సౌతాఫ్రికా ఆటగాడు అల్బర్ట్ రోస్-ఇన్నెస్‌ పేరిట నమోదైంది. డైమండ్ డక్ ఒక ఆటగాడికి ఆటలో భాగస్వామ్యం తీసుకునే అవకాశాన్ని దూరం చేయడమే కాకుండా, మ్యాచ్‌లో మలుపు తిప్పే సంఘటనగా కూడా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories