4. స్మృతి మంధాన (ఇండియా) – రూ.35 కోట్లు
ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సంపన్న మహిళా క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్రకు చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఆస్తి విలువ సుమారు రూ.35 కోట్లు. బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ.50 లక్షల వరకు పొందుతున్నారు స్మృతి. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో అత్యధిక జీతం అందుకుంటున్న ప్లేయర్ ఈమె... దీనిద్వారానే ఏటా కోట్లు సంపాదిస్తున్నారు.
ఇక ఎన్నో పెద్ద బ్రాండ్లకు మంధాన అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది… దీంతో డబ్బులే డబ్బులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది... ఇదికూడా ఆదాయ మార్గమే. ఇలా అన్ని రకాలుగా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు ఇండియన్ క్రికెటర్ స్మృతి మంధాన.
5. హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా) – రూ.26 కోట్లు
ప్రస్తుత ఇండియన్ ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రిచ్చెస్ట్ క్రికెటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఆమె మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.26 కోట్లు. బీసీసీఐ కాంట్రాక్ట్‌తో పాటు, విదేశీ లీగ్‌లు, యాడ్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది. ఈమె హయాంలోనే భారత మహిళల క్రికెట్ టీం ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఈ విజయం తర్వాత హర్మన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది... అమాంతం బ్రాండ్ వ్యాల్యూ పెరిగింది.
మొత్తం మీద ప్రపంచంలోని టాప్ 5 సంపన్న మహిళా క్రికెటర్ల జాబితాలో ముగ్గురు మనవాళ్లే ఉండటం గర్వించదగ్గ విషయం. ఇందులో తెలుగమ్మాయి టాప్ లో ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణం. మహిళల క్రికెట్‌లో ఎంత పెద్ద ఆర్థిక విప్లవం వచ్చిందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం.