Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్

Published : Sep 02, 2026, 08:47 AM IST

Team India: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వే సిరీస్‌లో ఆడిన 8 మందిని ప్లేయర్లను పక్కన పెట్టారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు.

PREV
16
దెబ్బకు మారిన టీమ్ ఇండియా.. బుమ్రా రీఎంట్రీ, యంగ్ స్టార్‌కు షాక్

బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో అనూహ్య మార్పులు కనిపించాయి.

26
జింబాబ్వే టూర్ ఆడిన 8 మంది అవుట్

ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను అఫ్గానిస్థాన్ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో సీనియర్లు, గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ మార్పులతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు చేరడంతో పాత వాళ్లకు చోటు దక్కలేదు.

36
మయాంక్ యాదవ్‌కు నిరాశ.. సీనియర్ల రీఎంట్రీ

జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్‌లో 3 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నా అతడిని పక్కన పెట్టారు. తొలి, మూడో టీ20ల్లో తొలి బంతి కే వికెట్ తీసి మయాంక్ మెరిసాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చారు.

46
జట్టు నుంచి బయటకు వెళ్లిన ఆటగాళ్లు

జింబాబ్వే సిరీస్ ఆడి ఇప్పుడు అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాని 8 మంది ఆటగాళ్ల జాబితా ఇదే..

• ప్రభ్‌సిమ్రన్ సింగ్

• మయాంక్ యాదవ్

• రింకూ సింగ్

• ప్రిన్స్ యాదవ్

• అశోక్ శర్మ

• హర్ష్ దూబే

• సూర్యాంశ్ శెడ్గే

• యశ్ ఠాకూర్

56
తిరిగి జట్టులోకి వచ్చిన 8 మంది ఆటగాళ్లు

• సంజూ శాంసన్

• జస్ప్రీత్ బుమ్రా

• నితీష్ కుమార్ రెడ్డి

• అర్ష్‌దీప్ సింగ్

• అక్షర్ పటేల్

• వాషింగ్టన్ సుందర్

• వరుణ్ చక్రవర్తి

• హర్షిత్ రాణా

66
అఫ్గానిస్థాన్ సిరీస్‌కు భారత పూర్తి జట్టు ఇదే

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

Read more Photos on
click me!

Recommended Stories