IPL 2025 Final: పంజాబ్ తో ఫైనల్.. మోడీ స్టేడియంలో ఆర్సీబీ రికార్డు ఎలా ఉందో తెలుసా?

Published : Jun 02, 2025, 02:04 AM IST

IPL 2025 Final RCB: ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో ఐపీఎల్ ఫైనల్‌ ఆడేందుకు రెడీగా ఉంది. 

PREV
15
ఐపీఎల్ 2025 ఫైనల్: పంజాబ్ కింగ్స్ ను ఆర్సీబీ మట్టికరిపిస్తుందా?

IPL 2025 Final RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ జూన్ 3న గుజరాత్‌లోని ఆహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్‌కి అర్హత సాధించింది. మరో ఫైనల్ ప్రేత్యర్థిగా ముంబై ఇండియన్స్ ను ఓడించి పంజాబ్ కింగ్స్‌ ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. 

బెంగళూరు జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2025లోని క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్ బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఈసారి టైటిల్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే ఫైనల్ వేదిక అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?

25
నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ రికార్డులు ఎలా ఉన్నాయి?

ఆర్సీబీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 3 గెలవగా, 3 ఓడిపోయింది. గత నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే విజయం సాధించింది. 

అయినప్పటికీ, ఈ సీజన్‌లో ఆర్సీబీ బలమైన టీమ్ గా అన్ని విభాగాల్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లో బలంగా ఉండటంతో ప్రతి మ్యాచ్‌లోనూ కొత్త హీరోలతో గెలుస్తూ వస్తోంది.

35
ఐపీఎల్ 2025 ఫైనల్ లో విరాట్ కోహ్లీ బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడా?

ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వరుసగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 

నరేంద్ర మోడీ స్టేడియంలో విరాట్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి, మొత్తం 219 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ 54.75 సగటు, 139 స్ట్రైక్ రేట్ తో తన ఆటను కొనసాగించాడు. దీంతో ఫైనల్‌లో విరాట్ కోహ్లీ నుంచి పెద్ద ఇన్నింగ్స్ వస్తుందని అంచనాలున్నాయి.

45
ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ రికార్డులు ఎలా ఉన్నాయి?

ఐపీఎల్ 2025తో కలిపి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాలుగు సార్లు ఫైనల్ కు చేరుకుంది. మొదటిసారి 2009లో ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ, దక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఆ తర్వాత 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో రెండో ఐపీఎల్ ఫైనల్ లో కూడా ఓడిపోయింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో 8 పరుగుల తేడాతో మూడోసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది.

55
ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి నాల్గో ఫైనల్.. ఈ సారిరైనా టైటిల్ గెలుస్తుందా?

ఐపీఎల్ 2025లో నాల్గో ఫైనల్ ఆడటానికి ఆర్సీబీ సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం కారణంగా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈసారి ఎలాగైనా విరాట్ కోహ్లీ టీమ్ టైటిల్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలన్న ఆశతో ఉంది. 

ఆర్సీబీ అభిమానులు జూన్ 3వ తేదీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో చరిత్ర తిరగరాయాలన్న లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories