Top 5 Fastest Test Cricket Centuries: టెస్ట్ క్రికెట్‌లో ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఎన్నో రికార్డులు సృష్టించారు. అందులో అత్యంత వేగవంతమైన సెంచరీలు సాధించిన 5 మంది బ్యాట్స్‌మెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టెస్ట్ క్రికెట్ ఒక ప్రత్యేకమైన థ్రిల్ ను అందిస్తుంది. ఈ ఐదు రోజుల ఆటలో బ్యాట్, బాల్ మధ్య ఆసక్తికర పోరాటం చూడవచ్చు. కొన్నిసార్లు బౌలర్లు బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయిస్తారు, మరికొన్నిసార్లు బ్యాటర్లది పైచేయి అవుతుంది. అయితే, టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా?
26
1. బ్రెండన్ మెకల్లమ్
టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్లలో మొదటి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ ఉన్నారు. ఆస్ట్రేలియాపై మెకల్లమ్ కేవలం 54 బంతుల్లో సెంచరీ కొట్టాడు.
బ్రెండన్ మెకల్లమ్ టెస్టు క్రికెట్ లో 101 మ్యాచ్ లను ఆడాడు. 176 ఇన్నింగ్స్ లలో 38.64 సగటుతో 6453 పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీ, 12 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 302 పరుగులు.
36
2. వివ్ రిచర్డ్స్
టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో రెండవ స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఉన్నారు. ఇంగ్లాండ్‌పై 56 బంతుల్లో సెంచరీ సాధించారు.
వివ్ రిచర్డ్స్ టెస్టు క్రికెట్ లో 121 మ్యాచ్ లను ఆడాడు. 182 ఇన్నింగ్స్ లలో 50.23 సగటుతో 8540 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 291 పరుగులు.
మూడవ స్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ మిస్బా ఉల్ హక్ ఉన్నారు. ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో సెంచరీ కొట్టాడు.
మిస్బా ఉల్ హక్ టెస్టు క్రికెట్ లో 75 మ్యాచ్ లను ఆడాడు. 132 ఇన్నింగ్స్ లలో 46.63 సగటుతో 5222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 161 పరుగులు.
56
4. ఆడమ్ గిల్‌క్రిస్ట్
నాలుగవ స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నారు. టెస్టుల్లో అతను 57 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
గిల్ క్రిస్ట్ టెస్టు క్రికెట్ లో 96 మ్యాచ్ లను ఆడాడు. 137 ఇన్నింగ్స్ లలో 47.61 సగటుతో 5570 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 17 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 204 పరుగులు.
66
5. శివనారాయణ్ చంద్రపాల్
ఐదవ స్థానంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ శివనారాయణ్ చంద్రపాల్ ఉన్నారు. 69 బంతుల్లో సెంచరీ సాధించారు.
శివనారాయణ్ చంద్రపాల్ టెస్టు క్రికెట్ లో 164 మ్యాచ్ లను ఆడాడు. 280 ఇన్నింగ్స్ లలో 51.37 సగటుతో 11867 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 203 పరుగులు.