మా నాన్న చనిపోయిన బాధలో నేనుంటే రవిశాస్త్రి నా దగ్గరకు వచ్చి.. సిరాజ్ షాకింగ్ కామెంట్స్

Published : Mar 18, 2022, 12:20 PM ISTUpdated : Mar 18, 2022, 12:22 PM IST

Mohammed Siraj: భారత యువ  పేసర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వెంటనే హైదరాబాద్ లో అతడి తండ్రి మహ్మద్ గౌస్ మరణించాడన్న వార్త తెలిసింది.  అయితే అతడు నిరాశతో కుంగిపోతున్న సమయంలో రవిశాస్త్రి సిరాజ్ దగ్గరకు వచ్చి...

PREV
110
మా నాన్న చనిపోయిన బాధలో నేనుంటే రవిశాస్త్రి నా దగ్గరకు వచ్చి.. సిరాజ్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేశాడు.   అయితే టెస్టు సిరీస్ కు కొద్ది రోజుల ముందు.. హైదరాబాద్ లో అతడి తండ్రి చనిపోయాడు. 

210

దీంతో అతడు తీవ్రంగా కుమిలిపోయాడు. అప్పుడు ఆస్ట్రేలియాలో క్వారంటైన్ నిబంధనలు కఠినంగా ఉండటంతో అతడు తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. పట్టుదలతో ఆడి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

310

అయితే  సిరాజ్ తండ్రి చనిపోయాక జట్టు తనకు ఎంతో అండగా నిలిచిందని అతడు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా  టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తనకు మద్దతునిచ్చాడని పేర్కొన్నాడు. 

410

సిరాజ్ మాట్లాడుతూ... ‘నా తండ్రి చనిపోయినప్పుడు రవి సార్ నా దగ్గరకి వచ్చి.. మియా (సిరాజ్ ముద్దు పేరు), నీ తండ్రి నువ్వు టెస్టులో ఐదు వికెట్లు తీస్తే చూడాలని కోరుకున్నాడు.  నువ్వు సాధించగలవు.. అని నాకు చెప్పాడు. 

510

దాంతో నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఒకరకంగా చెప్పాలంటే నా తండ్రి మరణం నన్ను తీవ్రంగా బాధించింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు.  నిరాశ, నిస్ప్రుహలు నన్ను ఆవహించాయి.  నాకేం చేయాలో తోచలేదు..’ అని చెప్పుకొచ్చాడు.

610

సిరాజ్ తండ్రి గౌస్.. భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన తర్వాత చనిపోయిన విషయం తెలిసిందే. అయితే సిరాజ్ మాత్రం తండ్రి అంత్యక్రియలకు రాకుండా జట్టు కోసం అక్కడే ఉండిపోయాడు. ఇక్కడికొచ్చినా మళ్లీ క్వారంటైన్ నిబంధనలని ఎలాగూ పదిరోజుల పాటు ఉంచుతారని, అందుకే తాను అక్కడే ఉన్నానని చెప్పుకొచ్చాడు. 

710

‘ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను మళ్లీ ఇంటికెళ్లాలా..? లేక ఇక్కడే ఉండి నా తండ్రి కలను నేరవేర్చాలా..?  అని అనుకున్నాను. ఒకవేళ నేను ఇంటికెళ్లినా మళ్లీ క్వారంటైన్ లో ఉండాల్సిందే.  అక్కడికి వెళ్లడం కంటే  ఇక్కడే ఉండి నా తండ్రి కలను నెరవేర్చుతానని ఫిక్స్ అయ్యాను..’ అని సిరాజ్ తెలిపాడు. 

810

సిరాజ్ తండ్రి గౌస్ కోరుకున్నట్టే అతడు మెల్బోర్న్ టెస్టులో ఐదు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 2, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సిడ్నీ టెస్టులో కూడా 2 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ సిరీస్ లో 13 వికెట్లు తీశాడు సిరాజ్.

910

ఆ పర్యటనలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (13) తీసిన బౌలర్ సిరాజే కావడం గమనార్హం. సిరాజ్ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో భారత్ ఆ సీరిస్ ను 2-1తో గెలుచుకుంది. 
 

1010

ఇక భారత్ తరఫున ఇప్పటివరకు 12 టెస్టులు ఆడిన సిరాజ్.. 36 వికెట్లు పడగొట్టాడు.  స్వదేశంలో ఇంకా పర్మనెంట్ బౌలర్ కాకపోయినా.. విదేశాల్లో జరిగే మ్యాచులకు మాత్రం సిరాజ్.. బుమ్రా, షమీ లతో పాటు ఆడుతున్నాడు. ఈ స్పీడు గుర్రం  రాను రాను రాటుదేలుతూ భవిష్యత్ లో భారత్ కు నెంబర్ వన్ బౌలర్ గా ఎదుగుతున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories