ఏదో ఒకరోజు వీరూను కొడతా.. టీమిండియా మాజీ ఓపెనర్ కు వార్నింగ్ ఇచ్చిన అక్తర్.. కారణమిదే

Published : Mar 18, 2022, 11:44 AM IST

Shoaib Akhtar Warning To Virender Sehwag: ఆ ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లే.. ఒక సమయంలో ఆ ఇద్దరి మధ్య సమరం బ్యాట్-బంతికి పోరు మాదిరిగా ఉండేది. అయితే రిటైరయ్యాక కూడా ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పోరు సాగిస్తూనే ఉన్నారు.

PREV
17
ఏదో ఒకరోజు వీరూను కొడతా.. టీమిండియా మాజీ ఓపెనర్ కు వార్నింగ్ ఇచ్చిన అక్తర్.. కారణమిదే

టీమిండియా మాజీ ఓపెనర్, నజఫ్గడ్ నవాబ్ గా గుర్తింపు పొందిన వీరేంద్ర సెహ్వాగ్  తన ఫన్నీ ట్వీట్లతో  జనాలతో పాటు క్రికెటర్లను కూడా ఆశ్చర్యపరుస్తుంటాడు.  అలా చేసిన కామెంట్ ఒకటి పాకిస్థాన్  మాజీ బౌలర్ షోయభ్ అక్తర్ కు కోపం తెప్పించింది. 

27

ఎంతలా అంటే.. సెహ్వాగ్ చేసిన పనికి అక్తర్ కు ఒళ్లు మండింది. దీంతో అతడు  వీరూను ఏదో ఒక రోజు గట్టిగా  కొడతానని వార్నింగ్ కూడా ఇచ్చాడు.

37


ఇంతకీ ఏం జరిగిందంటే.. గతంలో షోయభ్ అక్తర్ సూట్ వేసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్ లో పంచుకుంటూ.. ‘ఇదిగో నా కొత్త లుక్.. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను...’ అని  ట్వీట్ చేశాడు. 

47

దీనికి వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేస్తూ..  ‘ఆర్డర్ రాసుకో.. ఒక బటర్ చికెన్, 2 నాన్ లు, ఒక బీర్.. తొందరగా తీసుకురా..’ అని  కౌంటర్ ఇచ్చాడు.  పరోక్షంగా హోటల్ లో వెయిటర్ లా అక్తర్ డ్రెస్ ఉన్నదని వీరూ చెప్పకనే చెప్పాడు. 

57

ఈ ట్వీట్ కు అప్పట్లో పెద్దగా రెస్పాండ్ కాని అక్తర్.. ఇటీవలే  యూట్యూబ్ లో పలువురు స్టాండప్ కమెడియన్లతో ఓ కార్యక్రమం నిర్వహించాడు. అందులో తన్మయ్ భట్.. అక్తర్ ను వీరూ కామెంట్ గురించి అడిగాడు. 
 

67

దీనికి అక్తర్ తో పాటు అక్కడున్న వాళ్లంతా ఘొల్లున నవ్వారు. అనంతరం అతడు సమాధానం చెబుతూ..  ‘ఊరుకుంటున్నా అని వీరూ  కౌంటర్ల జోరు పెంచుతున్నాడు. ఒకరోజు వీరూ ను గట్టిగా కొడతా..’ అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. 

77

అక్తర్ కామెంట్స్ ఎలా ఉన్నా.. అతడి డ్రెస్ పై  వీరూ చేసిన కామెంట్స్  మాత్రం  భారత అభిమానులు, అక్తర్ వ్యతిరేకులను మాత్రం బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్ ఫీల్డ్ లో ఎలా ఉన్నా ఆఫ్ ది ఫీల్డ్ లో మాత్రం అక్తర్-వీరూ లు మంచి మిత్రులు.  

Read more Photos on
click me!

Recommended Stories