Glenn Maxwell About Virat Kohli: ఐపీఎల్ లో తొమ్మిదేండ్ల పాటు ఆర్సీబీని నడిపించిన నాయకుడు కోహ్లి.. కానీ ఈ ఏడాది నుంచి ఫాఫ్ డుప్లెసిస్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. అయితే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో...
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు తొమ్మిదేండ్ల పాటు సారథిగా ఉన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత సీజన్ లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
28
ఈ ఐపీఎల్ సీజన్ నుంచి అతడు కొత్త సారథి ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఆడనున్నాడు. అయితే కెప్టెన్సీ భారం దిగిపోవడంతో కోహ్లి ఇప్పుడు మరింత ప్రమాదకారి అని ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ అన్నాడు. ప్రత్యర్థి జట్లకు ఇక కష్టమే అని హెచ్చరికలు జారీ చేశాడు.
38
మ్యాక్సీ మాట్లాడుతూ.. ‘అతడిపై ఇన్నాళ్లు ఉన్న కెప్టెన్సీ భారం దిగిపోయింది. నా దృష్టిలో కోహ్లికి అది పెద్ద బాధ్యత. దానివల్ల అతడు అనుకున్న స్థాయిలో రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడలా కాదు.
48
ఆ బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకున్నాడు. ఇది ప్రత్యర్థి జట్లకు మరింత ప్రమాదకరం. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతడు ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఆడతాడు.
58
తనపై ఏ ఒత్తిడి లేకుండా అతడి ఆటను అతడు స్వేచ్ఛగా ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. నా తొలి రోజుల్లో అతడికి వ్యతిరేకంగా ఆడేప్పుడు అతడితో తీవ్రమైన పోటీని భావించేవాడిని.
68
ఈ సంవత్సర కాలంలో నేను అతడిలో ఎక్కువ గమనించిన విషయమేమిటంటే.. తన నిర్ణయాధికారం, భావోద్వేగాలతో నన్ను ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది కాలంలో నేను కోహ్లితో మరింత సన్నిహితంగా ఉండగలిగాను...’ అని మ్యాక్స్వెల్ చెప్పుకొచ్చాడు.
78
ఇదిలాఉండగా.. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక జాతీయ జట్టు తరఫున కోహ్లి పెద్దగా మెరుపులు మెరిపించిందేమీ లేదు. టీ20లతో పాటు అన్ని ఫార్మాట్లలోనూ అతడు ఇప్పుడు ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు.
88
కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో వన్డేలలో గానీ, టీ20లలో, శ్రీలంకలతో టెస్టులలో గానీ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఆర్సీబీ తరఫున ఏ స్థాయిలో ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరం.