Riyan Parag
Ranji Trophy 2024 - Riyan Parag: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రంజీ ట్రోఫీ 2024లో అస్సాం వర్సెస్ ఛత్తీస్ గఢ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ రెండో ఇన్నింగ్స్ లో తన బ్యాట్ తో విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఛత్తీస్ గఢ్ విజయం ఖాయంగా కనిపించినా పరాగ్ తన బ్యాట్ తో విశ్వరూపం ప్రదర్శించాడు. ఎలైట్ గ్రూప్ బీలో అస్సాం కెప్టెన్‌గా బరిలోకి దిగిన పరాగ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు.
రియాన్ 87 బంతుల్లో 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ రెండో ఇన్నింగ్స్ లో 87 బంతుల్లో 12 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో 155 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టుకు 86 పరుగుల ఆధిక్యం లభించింది.
రంజీ ట్రోఫీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ రియాన్ రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2023) గత ఎడిషన్ నుంచి పరాగ్ దేశవాళీ క్రికెట్ లో మంచి ఫామ్ తో అదరగొడుతున్నాడు.
ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు హాఫ్ సెంచరీలతో 10 ఇన్నింగ్స్ లలో 85 సగటుతో 510 పరుగులు చేశాడు. అలాగే, ఈ లెగ్ స్పిన్నర్ 10 మ్యాచ్ లలో 7.29 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. రియాన్ తాజా ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
Dhoni-Riyan Parag
కాగా, రియాన్ పరాగ్ వీరోచిత ప్రదర్శన చేసినప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులు చేసిన ఛత్తీస్గఢ్ చేతిలో అస్సాం తొలిరౌండ్ మ్యాచ్ లో ఓడిపోయింది.