IND vs AFG: సూపర్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు..?

First Published | Jan 8, 2024, 12:27 PM IST

India vs Afghanistan T20I Series: జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. బీసీసీఐ ఈ సిరీస్ కోసం జ‌ట్టును ప్ర‌క‌టించ‌గా, సూప‌ర్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ కు చోటుద‌క్క‌లేదు.  
 

KL Rahul

IND vs AFG T20I Series: ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ20ల సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేయడంతో చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. అయితే అద్భుతమైన ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు. రాహుల్ ను జ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డంతో అత‌ని అభిమానులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

KL Rahul

ఆఫ్ఘనిస్తాన్ మూడు టీ20ల సిరీస్ కు ఎంపిక చేసిన భార‌త‌ జట్టులో కేఎల్ రాహుల్ కు చోటు దక్కలేదు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న రాహుల్ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ తన బ్యాట్ తో అదరగొట్టాడు. అయినప్పటికీ 16 మంది సభ్యుల జట్టులో రాహుల్ కు చోటు దక్కలేదు. రాహుల్ ను పట్టించుకోకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


KL Rahul

2022లో చివరలో టీ20 మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్..

కేఎల్ రాహుల్ తన చివరి టీ20 మ్యాచ్ ను 2022లో ఇంగ్లాండ్ తో ఆడాడు. భారత జట్టు తరఫున రాహుల్ ఇప్పటివరకు 72 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ 139 స్ట్రైక్ రేట్ తో 2265 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో రాహుల్ రెండు సెంచరీలు చేయ‌డంతో పాటు 22 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్ర‌స్తుతం స్ట్రైక్ రేటు కూడా పెరిగింది. అయితే, జ‌ట్టులోకి ఎందుకు తీసుకోలేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా క్రికెట్ ల‌వ‌ర్స్ ప్ర‌శ్న‌లు  సంధిస్తున్నారు. సెల‌క్ట‌ర్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

KL Rahul

సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ల‌కు ఆఫ్ఘనిస్తాన్ తో జ‌రిగే మూడు టీ20ల సిరీస్ కు విశ్రాంతినిచ్చిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాఫ్రికాలో బుమ్రా, సిరాజ్ లు బాల్, కేఎల్ రాహుల్ బ్యాట్ తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన సంగ‌తి తెలిసిందే.

KL Rahul_Virat Kohli

శివమ్-శాంసన్ కు అవ‌కాశం.. 

ఆఫ్ఘనిస్తాన్ తో జ‌ర‌గ‌బోయే సిరీస్ కు భారత జట్టులో సంజూ శాంసన్ కు చోటు దక్కింది. అంత‌కుముందు, దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 జట్టులో సంజుకు చోటు దక్కలేదు. అలాగే, ఆసియా గేమ్స్ లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన శివమ్ దూబే కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయ‌బోతున్నాడు.

Latest Videos

click me!