T20 World Cup 2024: ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్.. ఐసీసీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు.. !

First Published | Jan 7, 2024, 11:08 AM IST

T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో భారత్‌, పాకిస్థాన్ జ‌ట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. భార‌త్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. ఆ రెండు జ‌ట్లు సూప‌ర్ 8లోకి వెళ్ల‌డం ప‌క్కా.. ఐసీసీ బిగ్ ప్లాన్ తోనే ఇలా చేసింది.. ! 
 

India vs Pakistan: అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తోన్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 మెగా టోర్నీ జూన్ 1 నుంచి 29 వరకు జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, నేపాల్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, పాకిస్థాన్, నమీబియా, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, ఉగాండా, కెనడా జట్లు ఈ టోర్నీ ఆడనున్నాయి.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 ఆడ‌బోతున్న మొత్తం 20 జట్లను గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ, గ్రూప్ డీ అనే నాలుగు గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపులో ఐదు జట్లను ఉంచారు. గ్రూప్ దశ మ్యాచ్ లు జూన్ 1 నుంచి 18 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతి కేటగిరీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 రౌండ్ కు చేరతాయి. సూపర్ 8 రౌండ్ ను 2 విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు.


జూన్ 26, 27 తేదీల్లో తొలి, రెండో సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. జూన్ 1న గ్రూప్-ఎలో అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ డల్లాస్ లో జరుగుతోంది. భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ లు అమెరికాలోనే జరుగుతున్నాయి.

ICC, T20 World Cup, india, cricket

అయితే భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల‌ను ఐసీసీ ఒకే గ్రూప్ లో ఉంచింది. దీని వెనుక ఐసీసీ మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌ని తెలుస్తోంది. మొత్తం నాలుగు గ్రూప్ ఉండ‌గా, ఒక్కో గ్రూప్ నుంచి రెండు జ‌ట్లు సూప‌ర్ 8 కు అర్హ‌త సాధిస్తాయి. ఈ లెక్క‌న చూస్తూ ఒకే గ్రూప్ లో ఉన్న భార‌త్, పాక్ జ‌ట్లు సూప‌ర్ 8కు రావ‌డం ప‌క్కా.. ఎందుకంటే, ఈ గ్రూప్ లో ఉన్న మిగ‌తా జ‌ట్లు భార‌త్, పాక్ ల‌తో పోటీలో స‌రితూగే అవ‌కాశం లేదు.. ! 

భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్ 8 దశకు చేరుకునేందుకు వీలుగా ఐసీసీ గ్రూప్-ఎలో చోటు కల్పించింది. ఈ రెండు జట్లతో పాటు ఐర్లాండ్, అమెరికా, కెనడా మూడు జట్లు జట్టులో చోటు దక్కించుకున్నాయి. అందువల్ల భారత్, పాకిస్థాన్ జట్లు తాము ఆడే 4 మ్యాచ్ ల్లో ఏ మ్యాచ్ లో కనిపించినా టాప్ 2లో నిలిచి సూపర్ 8 రౌండ్ కు చేరుకునేలా షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్నాయి.

ind pak

భార‌త్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రేజ్ మాములుగా ఉండ‌దు. ఈ రెండు దేశాల మ్యాచ్ కోసం క్రికెట్ ప్ర‌పంచం సైతం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుంటుంది. ఈ రెండు దేశాల మ్యాచ్ అంటే క్రికెట్ ల‌వ‌ర్స్ కు గొప్ప విందు అనే చెప్పాలి ! ఇది టోర్నీపై మ‌రింత ఆస‌క్తిని పెంచ‌డానికి ఈ రెండు జ‌ట్లు భాగానే ప్ర‌చారం కూడా క‌ల్పిస్తాయి.. క్రికెట్ విష‌యంలో ఈ రెండు దేశాల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.. అందుకే ఐసీసీ ఇలా ప్లాన్ చేసిందని క్రికెట్ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Image credit: Getty

గ్రూప్ ఏ లోని జ‌ట్లు: భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా. ఇందులో రెండు జట్లు సూపర్ 8 కు వెళ్తాయి. 

 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024లో భారత జట్టు ఆడే మ్యాచ్ లు: 

జూన్ 5 - భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్)

జూన్ 9 - భారత్ వర్సెస్ పాకిస్థాన్ (న్యూయార్క్)

జూన్ 12 - ఇండియా వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్)

జూన్ 15 - ఇండియా వర్సెస్ కెనడా  (లాడర్ హిల్-ఫ్లోరిడా)

ఈ మ్యాచ్లన్నీ రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇందులో సెమీఫైనల్స్, ఫైనల్స్ కు రిజర్వ్ డే ఉంది.

Latest Videos

click me!