రాహుల్ ద్రావిడ్: ఐపీఎల్ 2026 కు ముందు రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్

Published : Aug 30, 2025, 06:58 PM IST

Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజీనామా చేశారు. భారత జట్టుకు అత్యంత విజయవంతమైన ప్లేయర్, కోచ్ గా గుర్తింపు సాధించిన ద్రావిడ్.. ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ ను వీడటం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.

PREV
16
రాజస్థాన్ రాయల్స్ కు రాహుల్ ద్రావిడ్ గుడ్ బై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజస్థాన్ రాయల్స్ (RR) కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజీనామా చేశారు. 

ఈ విషయాన్ని ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. 2024 సెప్టెంబర్‌లో భారత జట్టు కోచ్ పదవి ముగిసిన తర్వాత ద్రావిడ్‌ను రాయల్స్ ప్రధాన కోచ్‌గా నియమించారు.

DID YOU KNOW ?
ఐపీఎల్ లో రాహుల్ ద్రావిడ్
రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, ఆ తర్వాత కోచ్‌గా కూడా పనిచేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (కెప్టెన్) జట్ల తరఫున ఆడారు. 2014, 2015 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటార్‌గా, 2025లో ప్రధాన కోచ్‌గా ఉన్నారు.
26
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ నిరాశాజనక ప్రదర్శన

భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపించిన రాహుల్ ద్రావిడ్ నాయకత్వం పై రాజస్థాన్ రాయల్స్ భారీ అంచనాలు పెట్టుకుని జట్టు బాధ్యతలు అప్పగించింది. అయితే, ద్రవిడ్ ప్రధాన కోచ్ గా వచ్చిన తర్వాత ఐపీఎల్ 2025లో రాజస్థాన్ ప్రదర్శన గొప్పగా లేదు.

ఐపీఎల్ 2025 ఎడిషన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు సాధించి, 10 ఓటములు ఎదుర్కొంది. మొత్తం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2021 తర్వాత ఇది రాయల్స్‌కు అత్యంత నిరాశాజనక సీజన్‌గా మిగిలింది.

36
ద్రావిడ్ గురించి రాజస్తాన్ రాయల్స్ ఏం చెప్పింది?

రాహుల్ ద్రావిడ్ జట్టును వీడిన విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమ అధికారిక ప్రకటనలో.. రాహుల్ ద్రావిడ్ తన ప్రధాన కోచ్ పదవిని ఐపీఎల్ 2026 ముందు వదులుకుంటున్నారు. ఆయన మా జట్టులో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం ఒక తరం ఆటగాళ్లపై ప్రభావం చూపింది. జట్టులో విలువలు నూరిపోశారు. ఫ్రాంచైజీ సాంస్కృతిక వైఖరిపై చెరగని ముద్ర వేశారు. రాయల్స్ ఆటగాళ్లు, అభిమానులు ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు” అని వెల్లడించింది.

46
ఐపీఎల్ సీజన్‌కు ముందు కీలక నిర్ణయాలు తీసుకున్న ద్రావిడ్

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌లో, జట్టు వేలం వ్యూహంలో ద్రావిడ్ కీలక పాత్ర పోషించారు. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్మేయర్ జట్టులో కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు. 

అయితే కీలక ఆటగాళ్ల గాయాలు, చివర్లో సింగిల్ డిజిట్ పరుగుల తేడాతో వెనుకడుగు వేయడం వంటి గెలుపు సాధించలేని పరిస్థితులు జట్టు ప్రదర్శనను దెబ్బతీశాయి.

56
సంజూ శాంసన్ రాయల్స్ తోనే కొనసాగుతారా?

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. కానీ ఐపీఎల్ 2026కు ముందు ఆయన కూడా ఫ్రాంచైజీని విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. గాయంతో కొన్ని మ్యాచ్‌లను మిస్ అయిన సంజూ శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. జట్టులోకి వచ్చిన తర్వాత కూడా రియాన్ ను కెప్టెన్ గా కొనసాగించారు. సంజూ శాంసన్ రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి.

66
ఐపీఎల్ 2026కు ముందు కోచ్ లేని ఫ్రాంచైజీలు పెరుగుతున్నాయి !

ద్రావిడ్ రాజీనామా తర్వాత ఐపీఎల్ 2026కు ముందు కోచ్ లేని ఫ్రాంచైజీల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ చేరింది. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కూడా ఆ పదవి విడిచారు. లక్నో సూపర్ జెయింట్స్ కూడా సపోర్ట్ స్టాఫ్ మార్పులు చేస్తోంది. ప్రస్తుతానికి రాయల్స్ వద్ద కుమార సంగక్కర (డైరెక్టర్ ఆఫ్ క్రికెట్), విక్రమ్ రాథోర్ (బ్యాటింగ్ కోచ్), షేన్ బాండ్ (బౌలింగ్ కోచ్) ఉన్నారు.

2008లో తొలి సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత రాయల్స్ మళ్లీ ఐపీఎల్ కప్‌ను అందుకోలేకపోయింది. 2022లో గుజరాత్ టైటాన్స్‌ తో పోరులో రన్నరప్‌గా నిలవడం మాత్రమే వారి బెస్ట్ రిజల్ట్. ఇప్పుడు కొత్త ప్రధాన కోచ్ ను తీసుకొస్తుందా? లేదా సంగక్కరపై మరింత ఆధారపడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories